మా గురించి బెంగపడొద్దు..మేము క్షేమంగా ఉంటాం..

మా గురించి బెంగపడొద్దు..మేము క్షేమంగా ఉంటాం..
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

మార్కులు తక్కువవచ్చాయంటే తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయంతో ముగ్గురు విద్యార్థులు ఇంటినుంచి వెళ్లిపోయిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.

మార్కులు తక్కువవచ్చాయంటే తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయంతో ముగ్గురు విద్యార్థులు ఇంటినుంచి వెళ్లిపోయిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే ఎస్‌వీనగర్, నాగారానికి చెందిన వై. సామ్యూల్, తిరుమలనగర్‌కు చెందిన ఎం.చరణ్, శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన హేమంత్‌ సాయికృష్ణ ముగ్గురు స్నేహితులు. వీళ్లు ముగ్గురు కూడా ఏఎస్‌రావునగర్‌లోని సెయింట్‌ థెరిసా పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. అయితే ఫైనల్ పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం ప్రి ఫైనల్‌ పరీక్షలను నిర్వహించింది. ఇందులో ముగ్గురు విద్యార్థులకు మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో విద్యార్థులు ఇంటి నుంచి పారిపోవాలని ప్లాన్‌ చేసుకున్నారు.

మంగళవారం పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి, బయటికి వెళ్లి పోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకున్నారు. వారి ఖర్చుక కోసం హేమంత్‌ రూ.5 వేలు, సామ్యూల్‌ రూ.6 వేలు నగదు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే చరణ్, హేమంత్‌లు తమతల్లిదండ్రుకు ధైర్యం చెపుతూ ఈ విధంగా లెటర్ రాసారు. తమ గురించి బెంగపడొద్దని, తాము క్షేమంగా ఉంటామని, ప్రయోజకులమయ్యాక తిరిగి వస్తామని రాసారు.

దీంతో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచారణ జరపగా బుధవారం మధ్యాహ్నం తర్వాత సామ్యూల్, హేమంత్‌సాయికృష్ణ హెచ్‌బీకాలనీలోని చరణ్‌ వద్దకు వెళ్లారని ,అక్కడ నుంచి ముగ్గురు కలిసి వెళ్లినట్లు సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌ల వద్ద గాలిస్తున్నారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories