ఎంసెట్‌ ఫలితాల కోసం తెలంగాణ విద్యార్థుల ఎదురుచూపు

ఎంసెట్‌ ఫలితాల కోసం తెలంగాణ విద్యార్థుల ఎదురుచూపు
x
Highlights

తెలంగాణలో కొన్ని నెలలుగా విద్యార్థులకు పరీక్షల కాలం ఎదురవుతూనే ఉంది. ఏ పరీక్ష రాసినా.. ఫలితాల కోసం నెలుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. మొన్నటి వరకూ...

తెలంగాణలో కొన్ని నెలలుగా విద్యార్థులకు పరీక్షల కాలం ఎదురవుతూనే ఉంది. ఏ పరీక్ష రాసినా.. ఫలితాల కోసం నెలుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. మొన్నటి వరకూ ఇంటర్‌ ఫలితాల కోసం ఎదురు చూసిన విద్యార్థులు, ఇప్పుడు ఎంసెట్‌ ఫలితాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి.

తొలుత ఇంటర్‌ వాల్యుయేషన్‌ను గ్లోబరీనా సంస్థకు అప్పగించడంతో ఫలితాలు తారుమారయ్యాయి. అది మొదలు... నిన్నటి రీవాల్యుయేషన్‌లో కూడా తప్పుడు ఫలితాలు దొర్లాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బోర్డు చర్యలతో రీవాల్యుయేషన్‌ తర్వాత కూడా ఫలితాలపై క్లారిటీ రాకపోవడంతో.. ఈ ప్రభావం ఎంసెట్‌ ఫలితాలపై పడినట్టు తెలుస్తోంది.

ఎంసెట్‌ ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులకు అడియాశ తప్పదా..? ఇంటర్‌ ఫలితాలపై క్లారిటీ లేకపోవడం, ఎంసెట్‌ ఫలితాల విడుదల తేదీ అయోమయం విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇంటర్ ఫలితాల గందరగోళం తేలితే కానీ, ఎంసెట్ ఫలితాలు వచ్చే అవకాసహం కనిపించడం లేదు. దీంతో తెలంగాణ లో విద్యార్థులు తమ భవిష్య్తతుపై ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories