విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఆత్మ స్థైర్యంతో ఉండాలి: గవర్నర్

విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఆత్మ స్థైర్యంతో ఉండాలి: గవర్నర్
x
Highlights

హైదరాబాద్ లో పేరు గాంచిన ఉస్మానియా యూనివర్సిటీలోని ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఈ రోజున ఐదో స్నాతకోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.

హైదరాబాద్ లో పేరు గాంచిన ఉస్మానియా యూనివర్సిటీలోని ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఈ రోజున ఐదో స్నాతకోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం డిగ్రీ విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేసారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఒక్క మహిళ ధైర్యంతో ముందడుగు వేయాలని తెలిపారు. ఆడపిల్లలు పెళ్లి అయిందని చదువును ఆపకూడదని తెలిపారు. ఎంత కష్టమైనా విద్యార్థులు వారి లక్ష్యాలను సాధించుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ధైర్య సాహసాలు కలిగి ఉండాలని తెలిపారు.

చిన్నప్పటి నుంచే మార్షల్‌ ఆర్ట్స్‌, కుంఫూ లాంటి ఆత్మ రక్షన కోర్సులను పాఠశాలల్లో నేర్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించడానికి గురువుల ఎంతో కృషి చేయాలని, విద్యార్థులను గురువులు ప్రోత్సాహించాలని ఆమె అన్నారు. ఇటీవల నగరంలో జరిగిన దిశ సంఘటన హృదయాన్ని కలిచివేసిందన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories