కాళేశ్వరం.. హరిత తెలంగాణకు ఆయువుపట్టు!

కాళేశ్వరం.. హరిత తెలంగాణకు ఆయువుపట్టు!
x
Highlights

నాగేటి చాలల్లో నా తెలంగాణ అంటూ సగర్వంగా తలెత్తుకు నిలబడే శుభముహూర్తం సమీపిస్తోంది. గోదారి నీళ్లతో తెలంగాణ బీళ్లన్నీ పంటచేలుగా మారబోతున్నాయి.. తడిసి...

నాగేటి చాలల్లో నా తెలంగాణ అంటూ సగర్వంగా తలెత్తుకు నిలబడే శుభముహూర్తం సమీపిస్తోంది. గోదారి నీళ్లతో తెలంగాణ బీళ్లన్నీ పంటచేలుగా మారబోతున్నాయి.. తడిసి పచ్చని చీర కట్టబోతున్నాయి.. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా సింగారించుకోబోతోంది.. ఈ పరిణామాలన్నింటికీ మూలం కాళేశ్వరం ప్రాజెక్ట్.. తెలంగాణను సస్యశ్యామల రాష్ట్రంగా నిలబెట్టే అపురూపమైన ఘట్టానికి కాళేశ్వరం ప్రాజెక్టే జీవనాధారం. జూన్ కల్లా.. జలకళతో కళకళలాడిస్తాన్న తెలంగాణ ప్రభుత్వం... ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది.

కాళేశ్వరం.. హరిత తెలంగాణకు ఆయువుపట్టు!

తలాపున గోదారి పారుతున్నా.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేని దైన్యం.. విస్తారమైన పంట పొలాలున్నా.... సాగుచేసేందుకు నీళ్లు లేని విషాదం.. నదీ జలాల్లో ఉమ్మడి రాష్ట్ర హయాంలో జరిగిన మోసం, దోపిడీ.. వీటన్నింటికీ ఇక చరమ గీతం పాడబోతోంది తెలంగాణ.. ఒక ప్రాజెక్టును కేంద్ర జలసంఘం సైతం మెచ్చుకోడం చరిత్రలోనే లేదు.. కాళేశ్వరం ప్రాజెక్టు సమీకృత బహుళార్ధ సాధక ప్రాజెక్టు.. అనేక చిన్న చిన్న ప్రాజెక్టులకు మూలాధారమైన అతిపెద్ద ప్రాజెక్ట్.. 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటూ, మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించే ధ్యేయంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. ఒక్క టిఎంసీ నీటితో 15 నుంచి 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అదుతుంది.. అనుకున్న ప్రకారం పనులు పూర్తయిపోతే కాళేశ్వరం జూన్ కల్లా వాడుకలోకి వచ్చేస్తుంది.

ప్రాజెక్ట్ కాదిది తెలంగాణ వెనుకబాటు తనాన్ని తరిమి కొట్టే ఆయువు పట్టు... రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించడానికి నిర్దేశించిన ప్రాజెక్ట్. తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న పట్టుదలతో కేసిఆర్ తలపెట్టిన ఈ ప్రాజెక్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం దగ్గర గోదావరి నదిపై కడుతున్నారు. దీని ఆయకట్టు పరిధి సుమారు 45 వేల ఎకరాలు.. సుమారు 235 టిఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం..

కాళేశ్వరం డిజైన్ చేసినప్పుడు సీఎం కేసీఆర్ మదిలో ఉన్న లక్ష్యాలు కొన్ని.. ఉన్న ఎకరాల భూమికి నీటిని అందించడమే కాదు.. అదనంగా కొత్త ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం, అలాగే ఆయకట్టు స్థిరీకరించడం, వీటితో పాటూ హైదరాబాద్ కి తాగునీరు అందించడమే లక్ష్యం.. అంతేకాదు.. తెలంగాణలోని ప్రతీ పల్లె జల జీవంతో ఉట్టి పడేలా ప్రాజెక్టును కేసీఆర్ డిజైన్ చేశారు.. కాళేశ్వరం కేవలం వ్యవసాయం, తాగునీరే కాదు.. పరిశ్రమల అవసరాలకూ 16 టిఎంసీల నీరును అందించబోతోంది. తెలంగాణ సంజీవని కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ మానస పుత్రిక.. ప్రాజెక్ట్ ప్రతీ దశలోనూ పర్యవేక్షణ.. ఇంజనీర్ల అకుంఠిత పనితనం.. కాళేశ్వరం వేగంగా రూపు దిద్దుకోడానికి కారణమైంది. అందుకే కాళేశ్వరంపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories