అరుదైన మధ్య రాతి యుగం నాటి పనిముట్లు లభ్యం..

అరుదైన మధ్య రాతి యుగం నాటి పనిముట్లు లభ్యం..
x
Highlights

చిన్నప్పుడు మధ్య, రాతి యుగం నాటి నాగరికత గురించి చరిత్ర పుస్తకాలలో అందరం చదివే ఉంటాం. చూసే ఉంటాం.

చిన్నప్పుడు మధ్య, రాతి యుగం నాటి నాగరికత గురించి చరిత్ర పుస్తకాలలో అందరం చదివే ఉంటాం. చూసే ఉంటాం. ఆ పుస్తకాల్లో ఆ యుగంనాటి వారి అలవాట్లు ఆచారాల గురించి స్పష్టంగా తెలిపేవారు. అయితే పుస్తకాల్లో రాసినట్టుగానే ఉన్నటు వంటి గుర్తులు గల ఆధారాలు కొన్ని సార్లు పురావస్తు శాఖ వారు చేపట్టిన తవ్వకాల్లో అక్కడక్కడా దొరికాయని ఎప్పుడో అప్పుడు వార్తల్లో వస్తూనే ఉంటాయి.

ఇప్పుడు ఇదే నేపధ్యంలోనే ఇటీవల కాలంలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం సుకన్యపల్లి గ్రామ శివారులోని దట్టమైన అడవిలో పాత చిత్తారయ్య గుహల్లో మధ్యయుగం కాలం నాటి కొన్ని ఆధారాలు దొరికాయి. ఈ నేపథ్యంలోనే పురావస్తు శాఖ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆధ్వర్యంలో పురావస్తు పరిశోధకుడు సముద్రాల సునీల్ ఆ ప్రాంతాన్ని అధ్యయనం చేసారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన అరుదైన రాతి చిత్రాలతో పాటు ఆ కాలంలోని ప్రజలు వాడిన అనేక సూక్ష్మరాతి పనిముట్లు దొరికినట్లు వారు పేర్కోన్నారు. ఆ పనిముట్లలో వారు జంతువులకు వేటాడడానికి ఉపయోగించిన బాణం ములుకుల, ఈటెలు వంటివి కనిపించాయని తెలిపారు.

ఆ యుగంలోని ప్రజలు జంతువులను వేటాడడానికి రాతి ములుకులను కర్రకు గుచ్చి ఉపయోగించేవారని తెలిపారు. అంతే కాక వారు రంగులకు ఉపయోగించి పెద్ద పెద్ద రాళ్లపై మనుషులు జింకలు బొమ్మలు ఎరుపు, తెలుపు రంగుల్లో వేసేవారని, అవి కూడా ఇప్పుడు దొరికాయని తెలిపారు. అయితే ఒకేచోట రెండు రకాల రంగులతో చిత్రాలుండటం అరుదైన అంశం అని చరిత్ర బృందం వెల్లడించారు. ఇది వరకు ఇలాంటి బొమ్మలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాండవుల గుట్ట కనిపించాయని, మళ్లీ ఇప్పుడు అలాంటి మేకబోమ్మ హాజీపూర్ మండలంలోనే కనిపించిందని తెలిపారు. ప్రస్తుతం కనిపించిన రాతి చిత్రాల వైశాల్యం, నీటివనరులు, పరిసరాల్ని పరిశీలిస్తే మధ్య రాతియుగంలో ఆదిమ మానవులు పెద్దసంఖ్యలో ఈ ప్రాంతంతో జీవనం సాగించినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories