logo

ఇంజనీర్లకు మించి..ప్రయోగాల ప్రభాకర్‌ అద్భుతాలు !

ఇంజనీర్లకు మించి..ప్రయోగాల ప్రభాకర్‌ అద్భుతాలు !
Highlights

చదివింది సెవెన్త్‌ క్లాస్‌ ఎక్స్‌పర్మెంట్‌ చేయడంలో ఎక్స్ పర్ట్. ఇంజనీర్లకు మించి అద్భుతాలు ప్రయోగాల ప్రభాకర్

చదివింది సెవెన్త్‌ క్లాస్‌ ఎక్స్‌పర్మెంట్‌ చేయడంలో ఎక్స్ పర్టు . ఇంజనీర్లకు మించి అద్భుతాలు సృష్టించాడు. నయా ఐడియాలతో దూసుకుపోతూ ఔర అనిపిస్తున్నాడు. అద్భుతాలు సృష్టించడానికి చదువులు, ర్యాంకులు అవసరం లేదని నిరూపించాడు. శ్రమను సృజనాత్మకతతో పాటు నమ్మకాన్నే పెట్టుబడిగా మలచుకుని తన ప్రయోగాలతో అబ్బురపరుస్తున్నాడు. ఎక్స్‌పర్మెంట్లతో సక్సెస్‌ అవుతోన్న విలేజ్‌ సైంటిస్టుపై స్పెషల్‌ స్టోరీ

జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ప్రభాకర్‌. ప్రబాకర్‌ కంటే ప్రయోగాల ప్రభాకర్‌గా ఫేమస్‌ అయ్యాడు. అనేక ప్రయోగాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. నయా ఐడియాలతో కొత్త కొత్త వస్తువులు, పరికరాల తయారుచేసే సృష్టికర్తగా పేరును సొంతం చేసుకున్నాడు. ప్రభాకర్‌ బుర్రనిండా కొత్త ఆవిష్కరణలే చదివింది సెవెన్త్‌ క్లాసే అయినా ఇంజనీర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రయోగాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. తండ్రి వృత్తిని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. నయా ఐడియాలతో ఏ పరికరాలు తయారు చేసిన పర్పెక్ట్‌గా ఉంటడంతో అతడి ప్రయోగాలకు క్రేజ్‌ పెరిగింది. ప్రభాకర్‌ సృష్టించిన వాటిలో ఎక్కువగా సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే ఉండటంతో పలువురిని అబ్బురపరుస్తున్నాయి.

గ్రామీణ ఇంజనీర్‌ రూపొందించిన ఓ బెడ్‌ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. వృద్థులు, వికలాంగులు, మంచానికే పరిమితమైన వాళ్ల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్‌ మంచం ఓ అద్భుతమనే చెప్పాలి. సకల సౌకర్యాలు ఉండటంతో పాటు కాలకృత్యాలు తీర్చుకోనేలా రూపొందించి ఔర అనిపించాడు. అన్నం తినడానికి, ఫేస్‌వాష్‌ చేసుకోవడానికి వీలుగా దీనిని తయారు చేశాడు.

ప్రభాకర్‌ తయారు చేసిన ప్రయోగాల్లో మరోకటి ఎక్కువగా ప్రజాదరణ పొందింది. విద్యుత్‌ లైన్‌మెన్ల కోసం అతిసులభంగా పోల్‌ ఎక్కేవిధంగా చెప్పులను తయారు చేశాడు. ఈ చెప్పులకు ఎంత డిమాండ్‌ ఉందటే ఏకంగా అమెజాన్‌ వాళ్లు ఆన్‌లైన్‌లో పెట్టారంటే ఆ చెప్పులకు ఉన్న క్రేజ‌్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సౌరశక్తిని పూర్తిగా వినియోగించుకునేలా స్టాకింగ్‌ సిస్టమ్‌ను రూపొందించాడు. అదే విధంగా 360 డిగ్రీలు తిరిగేలా పెద్ద పెద్ద కులర్లను తయారు చేసి అందరి మెప్పు పొందుతున్నాడు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తున్న ప్రభాకర్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. కనీసం గ్రాడ్యుయేషన్ కూడా చేయని గ్రామీణ ఇంజనీర్‌ ప్రతి వస్తువును ప్రజల అవసరాలకి అనుగుణంగా మారుస్తూ వాటిని తన జీవనోపాధిగా మార్చుకుని సక్సెస్‌ అవ్వడంతో పాటు పలువురికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాడు.


లైవ్ టీవి


Share it
Top