మన్యంలో బాహ్యప్రపంచానికి దూరంగా.. ఆ కుటుంబ దుర్భర జీవనం!

మన్యంలో బాహ్యప్రపంచానికి దూరంగా.. ఆ కుటుంబ దుర్భర జీవనం!
x
Highlights

అది మారుమూల గిరిజన గ్రామం. బాహ్య ప్రపంచానికి ఎలాంటి సంబంధాలు లేని కుగ్రామం. పిల్లలు చదివేందుకు బడి ఉండదు. పూజించేందుకు గుడి ఉండదు. రోగం వస్తే చికిత్స...

అది మారుమూల గిరిజన గ్రామం. బాహ్య ప్రపంచానికి ఎలాంటి సంబంధాలు లేని కుగ్రామం. పిల్లలు చదివేందుకు బడి ఉండదు. పూజించేందుకు గుడి ఉండదు. రోగం వస్తే చికిత్స చేసే వైద్యులుండరు. గిరిజన బిడ్డల ప్రాణాలు గాలిలో దీపాలే కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకవు. ప్రతి పూట ఆకలితో పోరాటం చేయాల్సిందే. పస్తులతో బతుకీడ్చాల్సిందే అందుకే ఆ గ్రామస్తులంతా ఊరిడిచి వెళ్లారు. కానీ ఒక్క కుటుంబం మాత్రం పుట్టిన ఊరిమీద ప్రేమతో అక్కడే ఉండిపోయింది. కొండకోనల్లో చీకటి ప్రపంచానికి దగ్గరగా జీవిస్తున్న ఆదివాసి కుటుంబంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

ప్రకృతి ఒడిలో అందంగా కనిపిస్తున్న ఈ ఊరు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని హత్తిఘాట్ గ్రామం. గ్రామానికి ఉండాల్సిన ఏ ఒక్క వసతి కూడా ఈ గూడెంలో కనిపించదు. కానీ గోండు కులానికి చెందిన ఓ కుటుంబం 50 ఏళ్లుగా ఇక్కడే బతుకీడుస్తోంది. చుట్టూ అటవీ ప్రాంతం 5 కిలోమీటర్లు కాలిబాటన నడిస్తేనే రోడ్డు కనిపిస్తుంది. సరుకులు తెచ్చుకోవాలన్నా మైళ్ల దూరం నడవాల్సిందే. ఏదైనా రోగం వస్తే ఆకు పసరే వైద్యంగా మారింది. రవాణా సౌకర్యం లేక అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇక ఇక్కడి చిన్న పిల్లల ప్రాణాలు గాలిలో దీపాలు. ఏదైన అనుకోని ప్రమాదం జరిగినా మరేదైన రోగం వచ్చినా ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు అడవి ప్రాంతం కావడంతో ప్రతి నిత్యం వన్యప్రాణులు ఏమైనా అపాయం తలపెడతాయని భయంతో ఉండాల్సిన పరిస్థితి.

ఇలాంటి ఊరిలో ఎవరూ ఉండాలనుకోరు. అందుకే ఈ గ్రామానికి చెందిన చాలా కుటుంబాలు వేరే ప్రాంతానికి వలస వెళ్లిపోయాయి. కానీ పదిమంది ఉన్న ఓ కుటుంబం మాత్రం పుట్టిన గడ్డపై ప్రేమతో ఇక్కడే ఉండిపోయింది. ఎన్నికష్టాలు వచ్చినా భరిస్తున్నారే తప్పా కన్నఊరిని విడిచివెళ్లడం లేదు. తమ ఊరికి సౌకర్యాలు కల్పించి తమ ఊరిని కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories