వృద్ధదంపతులను కాటేసిన పేదరికం...దంపతులే కాడెద్దులుగా మారారు

వృద్ధదంపతులను కాటేసిన పేదరికం...దంపతులే కాడెద్దులుగా మారారు
x
Highlights

దంపతులు ఇద్దరు తమ పొలాన్ని దున్నుకున్న ఘటన వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లమండలం సాల్విడ్‌ తాండలో జరిగింది. పుల్వా నాయక్‌ దంపతులు వ్యవసాయామే జీవనాధారంగా...

దంపతులు ఇద్దరు తమ పొలాన్ని దున్నుకున్న ఘటన వికారాబాద్‌ జిల్లా కుల్కచర్లమండలం సాల్విడ్‌ తాండలో జరిగింది. పుల్వా నాయక్‌ దంపతులు వ్యవసాయామే జీవనాధారంగా బతుకుతున్నారు. నలుగురు పిల్లలు ఉన్నా సాయం చేయలేని పరిస్థితివారిది. బతుకుదెరువు కోసం కన్నబిడ్డలు ముగ్గురు పూణె వెళ్లగా... వికలాంగుడైన కొడుకుతో అష్టకష్టాలుపడుతున్నారు. అసలే వృద్ధులు... ఆపై కటిక పేదరికం.... రోజులు గడుస్తున్నాయి...తిండిగింజలు లేక నానా తిప్పలు పడుతున్నారు. ఉన్నపొలంను సాగు చేసుకుందామంటే... పొలం పనులకు కాడెద్దులు లేవు. వయసు మీదపడటంతో ఆర్థికంగా ఆదుకునేవారు లేక అల్లాడుతున్నారు. సర్కారు ఇస్తున్న పెన్షన్‌ కూడా రాకపోవడంతో... సొంతభూమినే సాగుచేయాలన్న సంకల్పంతో ముందడుగువేశారు.

పస్తులతో పడుకునే బదులు కష్టాన్ని నమ్ముకోవాలని బలంగా సంకల్పించుకున్నారు. తమకున్న పొలంలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎద్దులు లేకపోయినా... చేదోడువాడుగా కాడెద్దుగా మారి... విత్తనాలు వేసుకున్నారు. ఉన్న కొద్దిపాటి పొలంలో దంపతులు జొన్నపంట సాగుకు శ్రీకారం చుట్టారు. ఎద్దులు కోనే స్థోమత లేదు... కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇద్దరూ కూలీలుగా మారారు. భర్త దంతే పట్టుకుంటే... భార్య లాగడం, భార్యదంతెపట్టుకుంటే భర్త లాగడం అలా అలిసిపోయే వరకు పొలం పనులు చేసుకుంటున్నారు ఆ వృద్ధదంపతులు.

వృద్ధ దంపతులు పడుతున్న కష్టాన్ని చూసి గ్రామస్తులు చలించిపోతున్నారు.అందరు ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారని వాపోతున్నారు. ఈ వయసులో పొట్టకూటి కోసం కష్టపడటం బాధగా ఉందని ఆవేదన చెందున్నారు. వృద్ధ దంపతుల సంకల్ప బలాన్ని చూసి కొందరూ ఆశ్చర్యపోతుంటే... మరికొందరు ప్రభుత్వం ఏదైనా సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories