మకీల్ గుండుతో.. నొప్పులు పరార్

మకీల్ గుండుతో.. నొప్పులు పరార్
x
Highlights

అదో గుండు రాయి...కానీ అక్కడి ప్రజలకు అదో సర్వరోగ నివారిణి. గ్రామస్ధుల పాలిట మహత్తర శక్తి. కడుపు నొప్పి, వెన్ను నొప్పి, నడుం నొప్పి ఇలా ఎలాంటి సమస్యైనా...

అదో గుండు రాయి...కానీ అక్కడి ప్రజలకు అదో సర్వరోగ నివారిణి. గ్రామస్ధుల పాలిట మహత్తర శక్తి. కడుపు నొప్పి, వెన్ను నొప్పి, నడుం నొప్పి ఇలా ఎలాంటి సమస్యైనా గ్రామస్ధులు ముందు ఆ గుండు రాయి దగ్గరికే వెళ్తారు. ఆసుపత్రిలో చికిత్స కంటే గుండు వైద్యానికే ప్రాధాన్యతనిస్తారు. ఇంతకీ ఆ గుండు రాయి మహత్యం ఏమిటి నొప్పులు నయం కావడానికి ఉన్న మతలబేంటో తెలుసుకుందాం.

నిజామాబాద్ నగరానికి కూతవేటు దూరంలోని మల్కాపూర్ శివారులో వెలిసిన గుండు రాయి ఇది. సుమారు 10 అడుగుల ఎత్తులో ఉండే ఈ రాయి దశాబ్దాల క్రితం ఏర్పడింది. నడుం నొప్పి, కడుపు నొప్పి, వెన్ను నొప్పులు ఉన్న వాళ్లు ఈ బండరాయి కింద నుంచి వెళితే నొప్పులు మాయం అవుతాయని గ్రామస్ధుల నమ్మకం. నమ్మకమే కాదు ఇలా వెళ్లిన వారిలో చాలా మందికి నొప్పులు క్షణాల్లో మాయమయ్యాయని చెబుతారు గ్రామస్ధులు. ఈ గుండురాయి వైద్యం మకీల్ నొప్పికి ప్రసిద్ధి.

ఈ బండ రాయి దశాబ్దాలుగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంది. ఎలాంటి ఆధారం లేకున్నా నిలబడింది. అదే ఇప్పుడు గ్రామస్ధులకు ఓ వైద్యశాలలా మారింది. బండ కింద మనిషి పట్టేంత ప్లేస్ ఉండకున్నా ఎంతో ఈజీగా దాని నుంచి దూరి బయటకొస్తుంటారు. సన్నగా ఉండే వాళ్లే కాదు లావుగా ఉన్న వాళ్లు కూడా ఈ బండరాయి కింది నుంచి సులువుగా వెళ్లొస్తుండటం ఈ గుండు స్పెషల్.

ఆ బండరాయి కింద నుంచి ఇలా దూరి రెండు సార్లు అటు ఇటు వెళితే చాలు ఎలాంటి నొప్పులైనా తగ్గిపోతాయంటున్నారు గ్రామస్తులు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు బండ రాయి వైద్యం తీసుకుంటే ఫలితం ఉండదట. ఉదయం ఖాళీ కడుపుతో వస్తేనే కడుపు నొప్పి మాయం అవుతుందట. మల్కాపూర్‌ బండరాయికి మకీల్ గుండుగా పేరు రావటంతో మకీల్ నొప్పులతో బాధ పడే వివిధ ప్రాంతాల వారు బండరాయి వైద్యానికి వస్తుంటారు. హైదరాబాద్- మహారాష్ట్ర, బాసర, భైంసా ప్రాంతాల నుంచి నొప్పులతో వచ్చి గుండు వైద్యం చేసుకుని వెళ్తుంటారని గ్రామస్ధులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories