ఉమ్మడి జిల్లాకు కాళేశ్వర ధార

ఉమ్మడి జిల్లాకు కాళేశ్వర ధార
x
Highlights

ఉత్తర తెలంగాణ గుండెకాయ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చేపట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాళేశ్వరం...

ఉత్తర తెలంగాణ గుండెకాయ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చేపట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంతో జిల్లా రైతాంగానికి రైతాంగానికి ఆశలు చిగురిస్తున్నాయి. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో బోసిపోయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు బ్యాక్ వాటర్ ఆధారంగా పూర్వ వైభవం తీసుకురానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా నిజామాబాద్ లో చేపట్టిన 20, 21 ప్యాకేజీ పనులతో ఇందూరు జిల్లా సస్యశ్యామలం కానుంది.

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద 2017 ఆగస్టు 10న సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులకు శంకుస్ధాపన చేశారు. మోపాల్ వద్ద పంప్ హౌజ్ నిర్మాణం, నవీపేట, మోపాల్, జక్రాన్ పల్లి, కమ్మర్ పల్లి, మండలాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంతో శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పనులపై జిల్లా రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు.

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులు పూర్తైతే.. నిజామాబాద్ జిల్లాలో 1,67, 800 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 2, లక్షల 34, వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. జగిత్యాల జిల్లా రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌజ్‌ల నిర్మాణాలు ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముప్కాల్ వద్ద 75శాతం పంప్ హౌజ్ పనులు పూర్తయ్యాయి. మోటార్లు బిగించి అక్టోబర్ కల్లా పనులు పూర్తి చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది.

20వ ప్యాకేజీ పనులు 90శాతం పూర్తికాగా మంచిప్ప వద్ద నిర్మిస్తున్న 21 ప్యాకేజీ పనుల్లో ప్రధాన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కాల్వలు, డ్రాప్ట్ ట్యూబ్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రధాన పైప్ లైన్ పనులు 60శాతం పూర్తయ్యాయి. పునరుజ్జీవ పథకం పనులు పూర్తైతే ఏటా జూన్ , జులై మాసంలో రివర్స్ పంపింగ్ ద్వార రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 60టీఎంసీల నీటిని శ్రీరాం సాగర్ కు నీటిని మళ్లించనున్నారు. దీంతో ఎస్సారెస్పీ నిండినా నిండకపోయినా ఆయకట్టు రైతులు సకాలంలో పంటలు వేసుకునే అవకాశం కలుగుతుంది. ఏమైనా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో బోసిపోయిన గోదావరి కాళేశ్వరం జలాలతో ఉరకలు వేసే అవకాశం ఉంది. పునరుజ్జీవ పనులు త్వరిత గతిన పూర్తైతే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం రానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories