Top
logo

లోయర్‌ పెనుగంగా ప్రాజెక్ట్: ఆదిలాబాద్ లో దర్శనమివ్వనున్న పచ్చని పొలాలు

లోయర్‌ పెనుగంగా ప్రాజెక్ట్: ఆదిలాబాద్ లో దర్శనమివ్వనున్న పచ్చని పొలాలు
X
Highlights

కోటి ఎకరాల మాగాణమే ప్రధాన లక్ష్యంగా రూపొందించిన ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతున్న వేళ తెలంగాణ మరో కోనసీమ ...

కోటి ఎకరాల మాగాణమే ప్రధాన లక్ష్యంగా రూపొందించిన ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతున్న వేళ తెలంగాణ మరో కోనసీమ కావడానికి ఇంకెంతో దూరం లేదు. గలగలా పారే నీటితో పచ్చని పొలాలు తెలంగాణలో దర్శనమివ్వబోతున్నాయి. తెలంగాణ సర్కారు చిత్తశుద్ధి, ప్రధానంగా సీఎం కేసీఆర్‌ సంకల్పం అలుపెరగని శ్రమ కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. దీంతో బీడు భూముల్లో జలసిరులు కురవనున్నాయి

కాళేశ్వరం.. పాలమూరు-రంగారెడ్డి.. డిండి ఎత్తిపోతల..లోయర్‌ పెనుగంగ.. వంటి ప్రాజెక్టులు తెలంగాణ భూమిని పచ్చగా మార్చబోతున్నాయి. శరవేగంగా జరుగుతున్న పనులతో రాష్ట్ర ముఖచిత్రామే మారిపోనుంది. కృష్ణమ్మ, గోదావరి తల్లి సైతం ముచ్చటపడేలా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టుల నిర్మాణాలతో కోటి ఎకరాల మాగాణం కోసం చేస్తున్న భగీరథయత్నం అబ్బురపడేలా చేస్తుంది.

ప్రాజెక్టులంటే దశాబ్దాల తరబడి సాగేవనే విధానానికి చరమగీతం పాడి, నిర్మాణరంగంలో రికార్డులను తిరుగరాసేలా రేయింబవళ్లు భారీయంత్రాలతో లోయర్‌ పెన్‌గంగా పనులు జోరుగా సాగుతున్నాయి. నిర్మాణ సమయంలో వర్షాల కారణంగా తీవ్రఇబ్బందులు పడ్డారు. వరదప్రవాహానికి భారీ యంత్రాలు కొట్టుకుపోయినా... ఎట్టకేలకు గేట్ల బిగింపు పూర్తి కావడంతో అన్నదాతలు ఆనందపడుతున్నారు.


Web TitleSpecial Report On Lower Penganga Barrage Works from Adilabad telangana
Next Story