అదరహో అనిపించిన స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌ విన్యాసాలు

అదరహో అనిపించిన స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌ విన్యాసాలు
x
Highlights

అరుదైన అసలు సిసలైన విన్యాసాలు అదరహో అనిపించాయి. అద్భుత విన్యాసాలు కేకపుట్టించాయి.

అరుదైన అసలు సిసలైన విన్యాసాలు అదరహో అనిపించాయి. అద్భుత విన్యాసాలు కేకపుట్టించాయి. అబ్బుర పరిచిన విన్యాసాలు చూసి సందర్శకుల కేరింతలు కొట్టారు. భాగ్యనగరంలో అదరహో అనిపించిన బెటాలియన్ల విన్యాసాలపై స్పెషల్‌ స్టోరీ.

తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌ బృందాలు చేసిన పరేడ్‌ విన్యాసాలు అదరహో అనిపించాయి. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పిపుల్స్‌ ప్లాజాలో tssp జవాన్ల అవుట్‌ పరేడ్‌ కనువిందు చేసింది. 57 రోజులలో శిక్షణ పూర్తి చేసుకున్న నాలుగు బెటాలియన్ల జవాన్ల పరేడ్‌, విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. జవాన్లు చేసిన అద్భుత విన్యాలకు సందర్శకులు ఫిదా అయ్యారు. కేరింతలు, ఈలలు వేస్తూ తెగ ఎంజాయ్‌ చేశారు.

తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ విభాగం ప్రధానంగా గ్రేమౌండ్స్‌, అక్టోపస్‌, సీఐడీ, ఇంటిలిజెన్స్‌, పోలీస్‌ అకాడమీ తదితరపోలీస్‌ విభాగాలకు ఫీడర్‌ యూనిట్‌గాఉంటూ శాంతి భద్రతల పరిరక్షణ, వ్యవస్ధీకృత నేరాల అదుపు, తీవ్రవాత,మత ఘర్షణల నియంత్రణ తదితర కార్య కలాపాల్లో స్థానిక పోలీస్‌లకు సహాయకారిగా ఉంటుంది. వీటితోపాటు ప్రతి బెటాలియన్‌ లో బ్యాండ్‌ యూనిట్‌లను కూడా ఏర్పాటుచేశారు. ఈ బ్యాండ్‌యూనిట్‌లు జాతీయ వేడుకలు, సెర్మొనియల్‌ పరేడ్‌లు, ఆతీయ, అంతర్జాతీయ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వనున్నాయి.

కన్నులపండువగా సాగిన అవుట్‌ పరేడ్‌ సందర్భంగా సైలెంట్ డ్రిల్, మల్లవిన్యాసాలతో పాటు వివిధ రకాల విన్యాసాలు నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. బ్రాస్‌బ్యాండ్‌, పైప్‌బ్యాండ్‌, సోలో ప్రదర్శనలతో పాటు గిరిజన సాంప్రదాయక నృత్యం గుస్సోడి, లంబా నృత్యం, ఆయుధాల డ్రిల్‌ ప్రదర్శనలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి.

శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు హోంమంత్రి మహమ్మద్‌ అలీ. పోలీస్‌ శా‌ఖ ఆధునీకరణకు, మెరుగైన శిక్షణకు అధిక నిధులను ఇస్తున్నారని అన్నారు. పోలీసులు దేశానికే రోల్‌మోడల్‌గా నిలచిందన్న ఆయన... అంకితభావంతో పనిచేయాలన్నారు.

స్పెషల్‌ బెటాలియన్లు చేసిన అబ్బుర విన్యాసాలను తిలకించిన డీజీపీ మహేందర్‌ రెడ్డి... జవాన్లను అభినందించారు. దేశరక్షణ కోసం తమ బాధ్యతగా వహించాలన్న ఆయన పెద్ద పల్లి జిల్లాలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అభినందించారు. ఇలాంటి మంచిపనులు చేసినప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు.

స్లైడ్ ట్రామన్ , టెన్నర్ , ట్రంపెట్స్, క్లారినెట్ ఈ నాలుగు బెటాలియన్ కి చెందిన బృందాలు సైలెంట్ డ్రిల్ అందరిని అబ్బరపరిచింది .. సైలెంట్ డ్రిల్ 2 చేస్తున్న జవాన్ లు జాతీయ పథకం కి వందనం చేసే విన్యాసాలు అందరిని ఆశ్చర్య పరిచాయి. ఇక అలలు అలలుగా కదులుతూ జవాన్ లు చేసిన విన్యాసాలు అందరిని నిల్చోబెట్టేలా చేశాయి.

కలర్‌పుల్‌గా సాగిన కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, రిటైర్డ్ పోలీస్ అధికారులు, విద్యార్థులు, జవాన్ ల కుటుంబ సభ్యులు పాల్కొని విన్యాసాలను ఎంజాయ్‌ చేశారు. దేశభక్తి గీతాలకు అనుగుణంగా జవాన్లు చేస్తున్న విన్యాసాలు చూసి కేరింతలు, ఈలలు వేశారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories