Top
logo

ఓరుగల్లు నడిబొడ్డున డేంజర్ బిల్డింగ్స్‌.. గాల్లో దీపంలా ప్రజల ప్రాణాలు

ఓరుగల్లు నడిబొడ్డున డేంజర్ బిల్డింగ్స్‌.. గాల్లో దీపంలా ప్రజల ప్రాణాలు
Highlights

అవి పెద్దపెద్ద రాజభవనాలు రంగురంగుల అందమైన భవంతులు వాటి నిర్మాణశైలి ముచ్చటగొలుపుతాయ్‌. ఓరుగల్లు రాచరికానికి అవి...

అవి పెద్దపెద్ద రాజభవనాలు రంగురంగుల అందమైన భవంతులు వాటి నిర్మాణశైలి ముచ్చటగొలుపుతాయ్‌. ఓరుగల్లు రాచరికానికి అవి గుర్తులు.. అంతటి అందమైన భవనాలు ఇప్పుడు మృత్యుపాశాలుగా మారాయి. మేడిపండులా పైకి అందంగా కనిపిస్తున్న ఈ భవనాలన్నీ డేంజర్‌ బెల్స్ మోగిస్తున్నాయి. ఎప్పుడు ఏది కూలిపోతుందో ఏక్షణాన ఏది విరిగిపడుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

వరంగల్‌ స్టేషన్ రోడ్‌, పాత బజార్‌, హన్మకొండ కాకాజీ కాలనీ, నయీంనగర్‌, సుబేదారి, బాపూజీనగర్‌ తదితర ప్రాంతాల్లో 900కి పైగా భవనాలు శిథిలావస్థకు చేరాయి. పైకి రంగురంగులతో అందంగా కనిపించే ఈ బిల్డింగులు ఎప్పుడు కూలతాయో తెలియని పరిస్థితి. మృత్యుపాశాలుగా తయారైన ఈ భవనాల్లో చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు ఉండటం కొసమెరుపు. అయితే, వందల ఏళ్లనాటి ఈ భవనాలు తొలగిస్తామని చెబుతున్న అధికారులు, కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దాంతో ఎప్పుడేం జరుగుతుందో, ఏక్షణాన ఏ భవనం కూలుతుందో తెలియక అటు ప్రభుత్వ సిబ్బంది, ఇటు ప్రజలు భయంతో కాలంవెళ్లదీస్తున్నారు.

వరంగల్‌ నగరం నడిబొడ్డున తహశీల్దార్ కార్యాలయమున్న భవనాన్ని 1886లో నిర్మించారు. 130ఏళ్లు పైబడిన ఈ బిల్డింగ్‌లో ఒకవైపు పెచ్చులూడుతుంటే, మరోవైపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు సిబ్బంది. ఇక ఉత్తర తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వాస్పత్రి పిల్లల వార్డులో స్లాబ్‌ పెచ్చలూడి తల్లీబిడ్డలకు గాయాలైన ఘటనలెన్నో ఉన్నాయి. దాంతో పలువురు వైద్యం కోసమొచ్చి పేషెంట్స్ గా చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక హన్మకొండ సర్కార్ స్కూర్‌, ఆర్జేడీ ఆఫీస్ కూడా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అడుగడుగునా ఇలా మృత్యుపాశాలు కనిపిస్తున్నా, అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేక కూలినప్పుడే అధికారులు స్పందిస్తారా? ముందే ఎందుకు చర్యలు తీసుకోరని ఓరుగల్లు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాలు కళ్ల ముందు కనిపిస్తున్నా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సామాజిక కార్యకర్త ఆయూబ్ మండిపడుతున్నారు.గ్రేటర్ వరంగల్‌లో 908 భవనాలు కూలిపోయే స్థితిలో ఉన్నట్లు తేలిందని, త్వరలోనే వాటిని తొలగిస్తామని టౌన్ ప్లానింగ్ అధికారి అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి, ప్రమాదం జరగక-ముందే మెల్కొని పాత భవనాల కూల్చివేతలు చేపట్టాలి, లేదంటే అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదముంది.



లైవ్ టీవి


Share it
Top