పోలీస్ శాఖలో ఇంటిదొంగలు

పోలీస్ శాఖలో ఇంటిదొంగలు
x
Highlights

కంచే చేనుమేసిన చందంగా తయారైంది పోలీసు శాఖ సిబ్బంది పనితీరు. అక్రమాలను కట్టడి చేయాల్సిన వారే అక్రమాలకు సహకరిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న వారికి...

కంచే చేనుమేసిన చందంగా తయారైంది పోలీసు శాఖ సిబ్బంది పనితీరు. అక్రమాలను కట్టడి చేయాల్సిన వారే అక్రమాలకు సహకరిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న వారికి అడ్డుకట్ట వేస్తుంటే, ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరన్న చందంగా మారింది. పోలసుశాఖలో కలుపుమొక్కలను ఏరేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అంతర్గత విచారణలో తేలిన నిజాలేంటి.

పోలీసులు.. పోలీస్ శాఖ అంటేనే అందరికి హడల్, ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా పసిగడుతారన్న పేరుంది, అలాంటి పోలీసులే అక్రమాలకు పాల్పడ్డారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుట్కా వ్యాపారాలు బెట్టింగ్, పేకాట స్థావరాల నిర్వాహకులు కలప స్మగ్లర్లతో చేతులు కలిపారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో అసలు నిజాలు బయటపడ్డాయి.

నిందితుల ఫోన్ నెంబర్లు కాల్ డేటాపై దర్యాప్తు చేసిన పోలీస్ బాస్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సొంత డిపార్ట్ మెంట్ కు చెందిన వారి నెంబర్లకే ఒకటి రెండు సార్లు కాదు వందల సార్లు ఫోన్ కాల్స్ రావడంతో అసలు కేటుగాళ్లు పోలీసులే ఉన్నారని గ్రహించారు. దాడులు జరిపే సమయంలో అక్రమార్కులకు ముందస్తు సమాచారం ఇస్తూ కేసుల్లో ఇరుక్కోకుండా అండగా నిలుస్తున్నట్లు విచారణలో తేలింది.

అక్రమార్కులకు అండగా నిలిచినవారిలో సివిల్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ టీంకు సంబంధించిన వాళ్లు కూడా ఉండటంతో కొందరిని విధుల్లో నుంచి తొలగించి విఆర్ కు ట్రాన్స్ ఫర్ చేసి లోతుగా విచారణ చేస్తున్నారు. సీఐ స్థాయి అధికారుల హస్తం కూడా ఉండటంతో వారికి సంబంధం లేకుండా విచారణ చేపడుతున్నారు.

పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ, అటవి, సివిల్ సప్లై శాఖల్లోనూ ఇలాంటి ఇంటిదొంగలు ఉన్నట్లు ఆధారాలు లభించినట్లు తెలిసింది. ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న చర్చ ఆయా వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories