శివరాత్రి వేడుకలు: వేములవాడకు హెలికాప్టర్ సేవలు

శివరాత్రి వేడుకలు: వేములవాడకు హెలికాప్టర్ సేవలు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతో ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం వేములవాడ. ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది మహాశిరాత్రి రోజున ఎంతో వైభవంగా జాతర కొనసాగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతో ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం వేములవాడ. ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది మహాశిరాత్రి రోజున ఎంతో వైభవంగా జాతర కొనసాగుతుంది. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎంతో మంది ఇక్కడికి తరలి వస్తారు. ఈ క్షేత్రానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. దీంతో ప్రభుత్వం ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయానికి కూడా హెలికాప్టర్ సేవల్ని ప్రారంభిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచీ వేములవాడకు ప్రత్యేక ప్యాకేజీల్లో హెలికాప్టర్ సేవలు అందిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా ఈ జాతరను వేడుకలను వైభవంగా నిర్వహించడానికి కోటి రూపాయలు ఇస్తున్నామన్ని ఆయన అన్నారు. అంతే కాక భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి వేములవాడ వరకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. శివరాత్రి రోజు గుడి చెరువు మైదానంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు కళాకారుల్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేములవాడలో జరిగే మహా శివరాత్రి కార్యక్రమాల్ని దిగ్విజయం చెయ్యాలని మంత్రి తెలిపారు.

మరోవైపు చూసుకుంటే మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నలుమూలల నుంచీ ఏపీలోని శ్రీశైల పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ సంస్థ నడిపిస్తుంది. ఈ బస్సుల్నిఈ నెల 18 నుంచీ 23 వరకు నడుపుతున్నారు. ప్రతీ 20 నిమిషాలకు ఓ బస్సును నడిపిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఇక పోతే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎంతో వైభవంగా నిర్వహించిన సమ్మక్క సారక్క జాతరలకు తెలంగాణ టూరిజం ప్రత్యేక హెలీకాప్టర్లను ఏర్పాటు చేసింది. ఇది విజయవంతం కావడంతో ఈ సారి వేములవాడకు కూడా హెలీకాప్టర్ సేవలను అందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories