నిజామాబాద్: గోడ కూలిన ఘటనపై స్పీకర్ పోచారం దిగ్భ్రాంతి

నిజామాబాద్: గోడ కూలిన ఘటనపై స్పీకర్ పోచారం దిగ్భ్రాంతి
x
Highlights

నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం తగిలేపల్లిలో గోడ కూలి ముగ్గురు మృతి చెందిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస...

నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం తగిలేపల్లిలో గోడ కూలి ముగ్గురు మృతి చెందిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి. సంఘటన గురించి తెలియగానే వర్ని మండల అధికారులు, తగిలేపల్లి గ్రామ ప్రజాప్రతినిధులతో ఫోన్ లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు స్పీకర్. సంఘటన ప్రాంతంలో అవసరమైన సహాయ చర్యలను చేపట్టడంతో పాటు ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు స్పీకర్ పోచారం. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు.

ఇంట్లో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలిపోవడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వర్ని మండలం తంగేలేపల్లికి చెందిన శ్రీనివాస్ (35), లక్ష్మీ (30) దంపతులు తమ కుమారుడు సాయి (ఏడాదిన్నర వయసు), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. గోడ కూలింది. దీంతో శ్రీనివాస్ దంపతులు, వారి కుమారుడు సాయి ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories