నన్ను నా ఇంటికి చేర్చండి: ఓ వృద్దురాలి కన్నీటి కథ

నన్ను నా ఇంటికి చేర్చండి: ఓ వృద్దురాలి కన్నీటి కథ
x
Highlights

ఇటీవలి కాలంలో ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేస్తున్నారు. ముసలితనం రాగానే తల్లిదండ్రులని వృద్దాశ్రమాల్లో వదిలేస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేస్తున్నారు. ముసలితనం రాగానే తల్లిదండ్రులని వృద్దాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ కసాయి కొడుకు కన్నతల్లిని వయసు మీద పడిందనే కారణంతో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. దాంతో ఆ ముసలి తల్లి దిక్కుతోచని పరిస్థితిలో తిండి తిప్పలు లేక ఎవరిని ఏం అడగాలో తెలియక నగరంలోని అన్ని వీధుల్లో తిరిగింది. దాంతో తిరిగి తిరిగి ఆ ముసలి తల్లి నీరసించి వీధుల్లో పడిపోయింది. దీంతో అక్కడున్న కొంత మంది స్థానికులు ఆమెను గమనించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే వికారబాద్ జిల్లా పరిగి సమీపంలోని రంగంపల్లికి చెందిన మేదరి సత్తెమ్మ, సాయిలు దంపతులకు నలుగురు సంతానం. వారలో సత్తెమ్మ భర్త సాయిలు అనారోగ్యంతో చనిపోయారు. అప్పట నుంచి సత్తెమ్మ వెంకటేష్, కృష్ణయ్య అనే ఇద్దరు కొడుకులతో తన సొంత గ్రామంలోనే ఉంటూ కుల వృత్తి చేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తుంది.

ఇలా ఆ తల్లి తన జీవనం సాగిస్తున్న సమయంలో తన చిన్న కొడుకు కృష్ణయ్య తల్లిని హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళుతున్నానని మాయ మాటలు చెప్పి ఆమెను నగరానికి తీసుకొచ్చాడు. ఈ తరువాత ఆమెను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చి కొద్దిసేపట్లో వస్తానని చెప్పి అక్కడి నుంచి వెల్లిపోయాడు. ఎంత సేపటికీ తన కొడుకు రాకపోవడంతో ఆ వృద్దురాలు కంగారు పడింది. ఆ తరువాత తన కొడుకును వెతుక్కుంటూ నగరంలో గాలింపు మొదలు పెట్టింపు. ఆమెకు నగరంలో ఎటు వెల్లాలో తెలియకుండా అన్ని వీధులను తిరిగింది.

ఈ నేపధ్యంలోనే సికింద్రబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఉప్పల్‌కు చేరుకుంది. రెండు రోజుల నుంచి తిండిలేకుండా దిక్కుతోచని పరిస్థితిలో తిరుగుతుండడంతో ఆమెను స్థానికులు గమనించారు. తరువాత ఆమెకు కాస్త భోజనం పెట్టి తరువాత పోలీస్ స్టేషన్ కు తీసుకెల్లి వారికి అప్పగించారు. దాంతో అక్కడి పోలీసులు ఆ వృద్దురాలిని ఉప్పల్ లోని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నిరాశ్రమ మహిళల ఆశ్రమానికి తరలించారు. అనంతరం వృద్దురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories