తెలంగాణ బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు..

తెలంగాణ బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు..
x
Highlights

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలా వద్దా అని కొన్ని రాష్ట్రాలు ఆలోచనలో ఉంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ ను కొనసాగిస్తేనే...

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలా వద్దా అని కొన్ని రాష్ట్రాలు ఆలోచనలో ఉంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ ను కొనసాగిస్తేనే బాగుటుందని, లాక్ డౌన్ కొనసాగిస్తేనే దేశాన్ని కాపాడుకోగలమని తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. కేసీఆర్ సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఓ వైపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న లాక్ డౌన్ ముగియడానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉండగా కరోనా కేసుల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అని కేంద్రం జారీ చేసే ప్రకటన గురించి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్నప్పటికీ, ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు.

ఇక నిన్న జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుందని, ఇందుకోసమే మరో రెండు వారాల పాటు(ఏప్రిల్‌ 15 తరువాత) లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధాని మోదీని కోరబోతున్నాం అని వ్యాఖ్యలు చేసారు. ఒక వేల కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తీసేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు మరికొన్ని రాష్ట్రాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు కూడా కేసీఆర్‌ బాటలోనే నడిచే అవకాశం కనిపిస్తోందంటున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ( 891), తమిళనాడు (571), ఢిల్లీ (525) రాజస్తాన్‌ (323) కేరళ (295) ఉత్తరప్రదేశ్‌ (301), మధ్యప్రదేశ్‌ (230), రాష్ట్రాలు కేసీఆర్ మాటను ఫాలో అవడానికి మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories