logo

గణేష్ చందా పేరుతో దందా....ఇవ్వకపోతే

గణేష్ చందా పేరుతో దందా....ఇవ్వకపోతే
Highlights

క నిజామాబాదులో అయితే ఏకంగా చందాల పేరుతో దొంగతనానికే ఎగబడ్డారు . వినాయక చందా అని వచ్చి మంచినీళ్ళు కావాలని చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు.

మరో వారంలో వినాయక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి . ఈ నేపద్యంలో వినాయక విగ్రహాలకి చందాలు అడగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ కొంత వరకు ఇది సక్రమంగానే ఉన్నా కొందరు మాత్రం గణేష్ చందాల ముసుగులో ఏకంగా దందాలు చేస్తున్నారు . మనకి తోచింది కాదు . వాళ్ళకి ఇష్టమోచ్చినంత రాస్తున్నారు . ఇవ్వకపోతే బలవంతం చేస్తున్నారు. డిమాండ్ చేస్తున్నారు . ఇది కేవలం నగరంలో మాత్రమే కాదు చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది . ఇక నిజామాబాదులో అయితే ఏకంగా చందాల పేరుతో దొంగతనానికే ఎగబడ్డారు . వినాయక చందా అని వచ్చి మంచినీళ్ళు కావాలని చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. అయితే అ మహిళ అరుపులు విన్నా స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తం కావడంతో ఒకరు తప్పించుకోగా మరొకరు దొరికితే అతనికి స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు . ఇలాంటి వారిని నమ్మకూడదని మహిళలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు .




లైవ్ టీవి


Share it
Top