కనీస సౌకర్యాలు లేకుండా కొనసాగుతున్న హాస్టళ్ళు ...

కనీస సౌకర్యాలు లేకుండా కొనసాగుతున్న హాస్టళ్ళు ...
x
Highlights

చదువుకోసం , ఉద్యోగంకోసం నగరానికి వచ్చే వారిని టార్గెట్ చేస్తూ కొందరు ప్రైవేట్ హాస్టల్ యజమానులు దందా నిర్వహిస్తున్నారు . కనీస సౌకర్యాలు నిర్వహించకుండా...

చదువుకోసం , ఉద్యోగంకోసం నగరానికి వచ్చే వారిని టార్గెట్ చేస్తూ కొందరు ప్రైవేట్ హాస్టల్ యజమానులు దందా నిర్వహిస్తున్నారు . కనీస సౌకర్యాలు నిర్వహించకుండా ఇరుకైన రీతిలో విద్యార్దులను పెట్టి డబ్బులు దోచుకుంటున్నారు . కనీసం ఒక్కొక్కరి దగ్గర మూడు వెయిల నుండి పది వెయిల రూపాయల వరకు లాగుతున్నారు . ముఖ్యంగా ఇది వెస్ట్ జోన్ పరిధిలోని హైటెక్ సిటీ, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలతో పాటు, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, వెంగళ్రావు నగర్, కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట, మెహిదీపట్నం, కాచిగూడ, సికింద్రాబాద్, వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కనీసమైన రూల్స్ పాటించకుండా ప్రైవేట్ హాస్టల్ లను నడిపిస్తున్నారు .

రూల్స్ ఇలా ఉండాలి ...

నిజానికి సిటీలో ఏ చిన్న వ్యాపారం మొదలు పెట్టాలన్నా జీహెచ్ఎంసీ యొక్క పరిమిషన్ పక్కా ఉండాలి . అంతేకాకుండా అవి సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేస్తూ ఉండాలి . ఇవేకాకుండా ఓ హాస్టల్ ఏర్పాటు చేయాలంటే విశాలమైన బిల్డింగ్ , ఫైర్ సెప్టి, సెక్యూరిటీ తప్పనిసరిగా మైంటైన్ చేయాలి . సీసీ కెమరాలు పెట్టాలి . కానీ కొన్ని హాస్టల్స్ లో ఇవి కనిపించడమే లేదు .. ఇవేమీ పట్టించుకోకుండా కొందరు అధికారులు కాసులకు కక్కుర్తిపడి అనుమతులు ఇస్తున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories