12ఏళ్లకే ఐటీ ఉద్యోగం...

12ఏళ్లకే ఐటీ ఉద్యోగం...
x
Highlights

12 ఏళ్ల వయసులో ఎవరైనా పిల్లలు స్కూల్ కి వెళ్ళొచ్చి హోం వర్క్ చేసుకుంటారు, లేదా ఆడుకుంటారు.

12 ఏళ్ల వయసులో ఎవరైనా పిల్లలు స్కూల్ కి వెళ్ళొచ్చి హోం వర్క్ చేసుకుంటారు, లేదా ఆడుకుంటారు. కాని ఈ అబ్బాయి మాత్రం తన 7 తరగతిలోనే ఐటి ఉద్యోగాన్ని సంపాదించాడు. చిన్నప్పటి నుంచి తల్లి దండ్రులు ఇచ్చిన ప్రోత్సహించడంతో అతను ఈ ఉద్యోగం సాధించాడు. వివరాల్లోకెళితే పి.రాజ్‌కుమార్, ప్రియలు గుంటూరు జిల్లా తెనాలికి చెందినవారు. వీళ్ళు క్యాప్‌జెమినీలో ఉద్యోగం చేస్తూ మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలో నివాసముంటున్నారు. వారి ఏకైక కుమారుడు శరత్‌ స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కావడంతో వారు రోజూ ఇంట్లో ల్యాప్‌టాప్‌లో పనిచేయటాన్ని ఆ విద్యార్థి చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాడు.

దీంతో అతిచిన్న వయసులోనే అతనికి కోడింగ్, జావా తదితర సాఫ్ట్‌వేర్‌లపై ఆసక్తి పెరిగి వాటిని నేర్చుకున్నాడు. అది గమనించిన అతని తల్లిదండ్రులు అతను ఐటీ ఉద్యోగానికి అర్హుడని నిర్ణయించారు. దీంతో కొన్ని ఐటీ సంస్థలలో ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. ఆ ప్రయత్నాలలో భాగంగా మోంటైగ్నే అనేసంస్థ నెలకు రూ.25 వేల గౌరవ వేతనంతో శరత్‌కు డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగ అవకాశం కల్పించింది.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందనలు.

ఏడో తరగతి చదువుతూ 12 ఏళ్ల వయసులోనే డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం దక్కించుకున్న శరత్‌ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభినందించారు. శరత్‌ తల్లిదండ్రులు మంగళవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా శరత్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories