భారత్‌ రానున్న ట్రంప్.. చిలుకూరు ఆలయానికి క్యూ కడుతున్న సాఫ్ట్‌వేర్ భక్తులు

భారత్‌ రానున్న ట్రంప్.. చిలుకూరు ఆలయానికి క్యూ కడుతున్న సాఫ్ట్‌వేర్ భక్తులు
x
Highlights

భారత దేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24వ తేదీన వస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే భారత్‌లో పర్యటించనున్నారు.

భారత దేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24వ తేదీన వస్తున్నారన్న విషయం తెలిసిందే. అయితే భారత్‌లో పర్యటించనున్నారు. తొలిసారి ఆయన ఇండియాకి అమెరికా అధ్యక్షుడి హోదాలో వస్తున్న సందర్భంగా సాఫ్టవేర్ ఇంజనీర్లందరూ హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయానికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు క్యూ కడుతున్నారు. అయినా ట్రంప్ దేశానికి రావడానికి, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు చిలుకూరు బాలాజి ఆలయానికి వెల్లడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.

అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ భారత దేశానికి వచ్చి దేశ ప్రధాని మోడీతో ఈ నెల 24వ తేదీన చర్చలు జరపనున్నారు. అమెరికా ప్రతిఏటా 85వేల h1B వీసాలు జారీ చేస్తుండగా అందులో 70శాతం భారతీయులకే ఇస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ చర్చల్లో ఇక్కడ ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు త్వరగా H1B వీసాలు జారీ చేసేవిధంగా చర్చలు జరపాలని. ఈ చర్చల్లో ట్రంప్ H1B వీసాలను తగ్గించాలన్న ట్రంప్ ఆలోచనా ధోరణిని, భారతీయుల పట్ల ట్రంప్‌ మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చాలని ప్రార్థిస్తున్నారు. అంతే కాదు భారత దేశం పట్ల, భారతీయుల పట్ల అమెరికాకు గౌరవం పెరగాలని.. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలప్రదంగా జరగాలని కోరుకుంటున్నారని సమాచారం.

ఇక పోతే సాధారణంగా ఎవరికైనా కోరికలు ఉంటే వీసా వీసా బాలాజి ఆలయానికి వెల్లి మొక్కుకొని 11 ప్రదక్షిణలు చేస్తారు. ఆ తరువాత వారి కోరికలు తీరినట్లయితే మరోసారి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తారు. కాగా ట్రంప్ దేశ పర్యటన సందర్భంగా తమ వీసా కోరికలు త్వరగా నెరవేరాలని శివరాత్రి రోజున భక్తులు రెండు ప్రదక్షిణలు ఎక్కువ చేశారు. ఇలా చేస్తేనన్నా తమ కోరికలు త్వరగా తీరుతాయని సాఫ్ట్ వేర్ భక్తుల నమ్మకం.

ఇక శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక నుంచి కూడా ఈ చిలుకూరు బాలాజి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. తమ వీసాలు త్వరగా అందేలా ఆశీర్వదించాలని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు స్వామి వారిని కోరుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories