Top
logo

అయ్య బాబోయ్... అరుగు కింద అన్ని పాములా..

అయ్య బాబోయ్... అరుగు కింద అన్ని పాములా..
Highlights

పాము అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. పామును చూస్తే చాలు అయ్యబాబోయ్ అంటూ ఇక్కడున్న వారు కూడా అంత దూరం పరుగులు తీస్తారు.

పాము అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. పామును చూస్తే చాలు అయ్యబాబోయ్ అంటూ ఇక్కడున్న వారు కూడా అంత దూరం పరుగులు తీస్తారు. భయంతో వణికి పోతారు. ఏ జాతికి చెందిన పాము కనిపించినా ఇదే పరిస్ధితి. ఒకటి రెండు పాములు కనిపిస్తేనే ఇంత భయం ఉంటే, ఒకే చోట సుమారుగా 50 పాము పిల్లలు, వందల కొద్ది పాము గుడ్లు ఉంటే పరిస్థితి ఏంటని ఆలోచిస్తేనే భయం వేస్తుంది.

కానీ మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధి ధన్నారంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. పూర్తివివరాల్లోకెళితే గ్రామానికి చెందిన కర్రె కిష్టయ్య అనే వ్యక్తికి ఇంటి ఆరు బయట మంగళవారం ఓ చిన్న పాము పిల్ల కనిపించింది. దీంతో అతను తన కుటుంబ సభ్యులను పిలిచి పామును చంపేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ పాము పిల్ల అతని చేతుల నుంచి తప్పించుకుని ఇంటి అరుగు కిందకు చేరుకుంది. ఈ విషయాన్ని అతను చుట్టుపక్కన వారికి చెప్పడంతో వారంతా వచ్చి అరుగును తొలిగించి చూసారు.

అరుగు కింద కుప్పలు కుప్పలుగా పాము పిల్లలు బయటికి రావడంతో ఒక్క సారిగా భయపడి వాటిని చంపడం ప్రారంభించారు. సరిగ్గా అదే సమయానికి పెద్ద పాము కూడా బయటికి రావడంతో దాన్ని కూడా చంపేసారు. ఇంకా ఏమైనా పాము పిల్లలు ఉన్నాయా అని పరీక్షించగా వారికి కుప్పలుగా పాము గుడ్లు కనిపించాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందారు, వాటిని చూడకుండా ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో అంటూ భయపడ్డారు.


Web TitleSnakes in Medak District Tekmal
Next Story