స్కూటీలో నాగుపాము హల్‌చల్‌

స్కూటీలో నాగుపాము హల్‌చల్‌
x
Highlights

రాచకొండ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో నాగుపాము హంగామా చేసింది. బైక్‌ నడుపుతుండగా మార్గమధ్యలో చేయికి ఎదో మొత్తగా తగిలినట్లు...

రాచకొండ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో నాగుపాము హంగామా చేసింది. బైక్‌ నడుపుతుండగా మార్గమధ్యలో చేయికి ఎదో మొత్తగా తగిలినట్లు అనిపించింది.ఏంటా అని చూస్తే.. పాము. ఒక్కసారిగా కంగుతిన్న వాహనదారుడు వెంటనే బైక్ కిందపడేసి పక్కకి దూకాడు. ఇక వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా చీకటి మామిడికి చెందిన రాములు ఎఫ్‌సీఐలో కొలువు చేస్తాడు. రోజులాగే ఈరోజు కూడా తన స్కూటీపై వెళ్తుండుగా రాంపల్లి మహంకాళి ఆలయం వద్దకు రాగానే ఆయన చేతిని ఏదో తాకుతున్నట్టుగా అనిపించడంతో స్కూటీని ఆపి చూడగా హెడ్‌లైట్‌లో నక్కి ఉన్న నాగుపాము పిల్ల కనిపించింది. పాముని చూసిన రాములు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆ పాముని చూసి భయపడి స్కూటీని కిందపడేశాడు. అక్కడే ఉన్న మహంకాళి ఆలయ చైర్మన్ రామారం వినోద్ గౌడ్ పాములు పట్టే మైసయ్యను పిలిపించి రాములు స్కూటీలో ఉన్న నాగు పామును తీయించి రాములుకు ప్రథమ చికిత్స చేయించారు. ఇప్పుడు దినికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories