కనికరం లేని కసాయి పాము!

కనికరం లేని కసాయి పాము!
x
Highlights

పాము అంటేనే విలన్ అని మన సినిమాల్లో చూపిస్తారు. అంటే పాలు పోసినా విషం కక్కుతుందని చెబుతూ విలన్లని పాములతో పోలుస్తారు. అది నిజమేనేమో అనిపించేలాంటి...

పాము అంటేనే విలన్ అని మన సినిమాల్లో చూపిస్తారు. అంటే పాలు పోసినా విషం కక్కుతుందని చెబుతూ విలన్లని పాములతో పోలుస్తారు. అది నిజమేనేమో అనిపించేలాంటి సంఘటన ఒకటి కనిపించింది. సాంకేతికంగా చెప్పినప్పుడు మాత్రం పాము దాని జోలికి వెళితేనో లేదా భయపడితేనో కాటు వేస్తుంది తప్పితే మామూలుగా ఏమీ చేయదనీ చెబుతుంటారు. అయితే, ఈ పాము చేసిన పని చూస్తే మొదటి స్టేట్మెంటే కరెక్ట్ అనిపిస్తుంది. తన పిల్లల జోలికి వెళ్లొద్దు వెళ్ళిపో అని పాపం ఆ పిల్లల కుక్క దాని భాషలో అది మొరుగుతుంటే నువ్వు మొరిగితే నీ పిల్లల్ని చంపేస్తా అంటూ బెదిరించి మరీ ఆ పని చేసి చక్కాపోయింది.

తన సహజ లక్షణాన్ని ఆ పాము చూపించింది. పాపం ఆ కుక్క కనీసం పాముపైకి దాడికి కూడా వెళ్ళలేదు. అయినా సరే తన రెండు పిల్లల్ని కోల్పోయింది. ఈ సంఘటన ఎల్ బి నగర్ నాగోల్ లో ఆర్ టి ఏ కార్యాలయం సమీపంలో చోటు చేసుకుంది. ఇక్కడ ఓ కుక్క తన పిల్లలను ఉంచింది. అక్కడకు ఓ నాగుపాము వచ్చింది. ఆ కుక్క పిల్లల వద్ద ఆగింది. అది చూసిన తల్లి కుక్క మొరిగింది. ఆ కుక్క మొరుగుతుండగా దానిని బుసలు కొడుతూ బెదిరించింది నాగుపాము. తరువాత కూడా కుక్క భయంతో మొరుగుతుంటే కుక్క పిల్లలను రెండిటిని కాటేసి అక్కడ నుంచి మెల్లగా జారుకుంది. తన కళ్ళముందే పిల్లలను కాటేసి పోతున్న నాగుపామును నిశ్చేష్టంగా చూస్తూ నిలబడిపోయింది పాపం ఆ తల్లి కుక్క. ఈ సంఘటన అక్కడ ఉన్న కొందరు వీడియో తీశారు. ఆ వీడియో చూస్తే నాగుపాము లక్షణమేమిటో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మీరూ ఆ వీడియో చూడండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories