logo

ఒకే కుటుంబంలో ముగ్గురికి పాముకాటు

ఒకే కుటుంబంలో ముగ్గురికి పాముకాటు
Highlights

మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురిని పాము కాటు వేసింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్...

మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురిని పాము కాటు వేసింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలం ఎర్రచెక్రుతండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన జాటోతు రవి(35), ఆయన భార్య, కుమారుడు శుక్రవారం నిద్రిస్తున్న సమయంలో వారిని పాము కాటేసింది. దీంతో వీరిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవి మృతి చెందగా, భార్య నీల, కుమారుడు చరణ్‌కు చికిత్స అందిస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top