logo

విమానాన్ని ఆపిన చిట్టెలుక...

విమానాన్ని ఆపిన చిట్టెలుక...
Highlights

ఎప్పుడూ మనుషులేనా నేనూ విమానం ఎక్కుతానని ఓ ఎలుక విమానంలో దూరింది. ఎలుక దూరిందన్న విషయాన్ని సిబ్బంది గమనించారు.

ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 11:30 గంటలు ఆలస్యంగా బయలుదేరిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విమానం బయలు దేరడానికి ఇన్ని గంటలు ఆలస్యం అవుతుంటే అక్కడున్న ప్రయాణీకులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అసలు ఈ విమానం ఆలస్యం కావడానికి వాతావరణం అనుకూలించకపోవడమో లేక ఏ సాంకేతిక లోపమో అని చాలా మంది అనుకుంటారు. కానీ అదేం కాదు... అసలు ఆ విమానం ఆలస్యం కావడానికి గల సమాచారం తాజాగా తెలిసింది. అంత పెద్ద విమానాన్ని ఒక చిన్న ఎలుక 11.30 గంటలు ఆపి ప్రయాణీకులను అష‌్టకష్టాలు పెట్టింది.

ఎప్పుడూ మనుషులేనా నేనూ విమానం ఎక్కుతానని ఓ ఎలుక విమానంలో దూరింది. ఎలుక దూరిందన్న విషయాన్ని ఎయిర్ ఇండియా సిబ్బంది గమనించారు. ఈ విషయం గురించిన సమాచారాన్ని ఏటీసీ అధికారులకు అందించారు. దీంతో ఆ ఎలుకను పట్టుకునేంత వరకు విమానాన్ని నిలిపివేశారు. అక్కడున్న ప్రయాణికులు మాత్రం విమానం ఎప్పడు బయలుదేరుతుందా అని గంటల తరబడి ఎదురుచూసారు.

ఆదివాకం ఉదయం 6:10 గంటలకు బయలుదేరాల్సిన విమానం మొదట 8 గంటలకు బయలుదేరుతుందన్నారు. తరువాత మధ్యానం 3 గంటలకు బయలు దేరుతుందన్నారు. ఆ సమయమూ దాటిపోయింది. ఇక కొంత మంది ప్రయాణీకులు ఈ విమానం బయలుదేరుతుందో లేదో అని వారి ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఇటు ఏటీసీ అధికారులు, సిబ్బంది మాత్రం వారి పనిలో వారు నిమగ్నమై ఎట్టకేలకు పది గంటలకుపైగా శ్రమించిన ఆ ఎలుకను పట్టుకున్నారు. దీంతో ఉదయం 6:10 గంటలకు బయలుదేరాల్సిన విమానం సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరింది. విమానంలో మొత్తం 250 మంది ప్రయాణించాల్సి ఉంటే వారిలో 50 మంది టికెట్లు రద్దు చేసుకుని తిరుగుప్రయాణం పట్టారు. చూసారా ఒక చిట్టెలుక ఇంత పెద్ద విమానాన్ని ఎలా ఆపిందో.




లైవ్ టీవి


Share it
Top