సిద్ధిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్ట్

సిద్ధిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్ట్
x
Narasimha reddy
Highlights

సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహ రెడ్డి 5 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనితో అతణ్ని అరెస్టు చేసి,...

సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహ రెడ్డి 5 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనితో అతణ్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, ఎస్పీ నర్సింహ రెడ్డి ఇల్లు, బంధువులు, బినామీల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

అయితే, ఈ సోదాల్లో కిలోన్నర బంగారం, రూ5.3 లక్షల నగదు, రూ.6 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, గోల్కొండలో విల్లాతో పాటు, శంకర్ పల్లిలో 14 ప్లాట్లు, సిద్దిపేట, మహబూబ్ నగర్‌లలో 20 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతనికి చెందిన రెండు కార్లను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అయితే తనపై కుట్రలో భాగంగానే ఈ దాడులు జరిగాయని తాను చాలా నిజాయతీపరుడినని చెప్పుకోచారు నరసింహ రెడ్డి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories