ఇ.డి(ఒ)గా శ్రీ యాదగిరి నూతన బాధ్యతల స్వీకరణ...

ఇ.డి(ఒ)గా శ్రీ యాదగిరి నూతన బాధ్యతల స్వీకరణ...
x
Highlights

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఒ)గా శ్రీ యాదగిరి నూతనంగా ఉన్నత బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా...

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఒ)గా శ్రీ యాదగిరి నూతనంగా ఉన్నత బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ యాదగిరిని ఇ.డి (రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి శ్రీ పురుషోత్తం అభినందించారు. అంతకు ముందు రీజినల్‌ మేనేజర్‌ (రంగారెడ్డి), గా బాధ్యతల్ని నిర్వర్తించిన యాదగిరికి ఇ.డిగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఒ)గా బాధ్యతలు చేపట్టిన యాదగిరికి సంస్థ చీఫ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ స్టోర్స్‌ శ్రీ విజయకుమార్‌, సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌ శ్రీ జి.కిరణ్‌ రెడ్డిలు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇ.డి (రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి శ్రీ పురుషోత్తం ఆయనను అభినందిస్తూ సంస్థ అభ్యున్నతి కోసం కృషి చేయాలని కోరారు. బస్‌ సర్వీసుల ఆక్యుఫెన్సీ రేషియో పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని సూచించారు.

ఇ.డి (ఒ) శ్రీ యాదగిరి ఉద్యోగ జీవిత నేపథ్యం...

సూర్యపేట జిల్లాలోని వర్ధమాన్‌ పేట గ్రామానికి చెందిన యాదగిరి 1980లో సర్వైల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదువుకున్నారు. 1987లో ఆర్టీసీలో అధికారిగా శిక్షణను పూర్తి చేసుకుని ఏలేశ్వరం, బుద్వేల్‌, జగిత్యాల, వరంగల్‌, కోరుట్ల డిపోలలో డి.ఎంగా పనిచేశారు. ఆ తదుపరి 1998లో డివిజనల్‌ మేనేజర్‌ (డి.వి.ఎం)గా పదోన్నతి పొంది వరంగల్‌, జగిత్యాల, హైదరాబాద్‌ డివిజన్లలో బాధ్యతల్ని నిర్వర్థించారు. సికింద్రాబాద్‌, కర్నూలులో డిప్యూటీ సి.ఎం.ఇగా విధులు నిర్వహించిన ఆయనకు 2010లో రీజినల్‌ మేనేజర్‌గా పదోన్నతి లభించింది. అనంతపూర్‌, వరంగల్‌, సనత్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి రీజియన్‌లలో మెరుగైన సేవలు అందించారు. గతంలో సంస్థ ఛైర్మన్‌, విసి అండ్‌ ఎం.డిల నుంచే కాక కలెక్టర్ల నుంచి దాదాపు 33 ప్రశంసా పత్రాలను అందుకోవడం ఆయన సేవలకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. సంస్థలో 32 ఏళ్ల నుంచి మెరుగైన సేవలు అందిస్తూ తనదైన ముద్ర ఏర్పరచుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories