అందరివాడు : శంకరపల్లికి సీఐ గోపీనాధ్ రక్షణ కవచం

అందరివాడు : శంకరపల్లికి సీఐ గోపీనాధ్ రక్షణ కవచం
x
Highlights

పోలీస్ అంటే డ్యూటీ మాత్రమేనా చెక్ పోస్టుల్లో తనిఖీలేనా కేసుల నమోదు, ఉల్లంఘనులపై ఉక్కుపాదమేనా అది మాత్రమే కాదంటున్నాడో సీఐ. శాంతిభద్రతలే కాదు...

పోలీస్ అంటే డ్యూటీ మాత్రమేనా చెక్ పోస్టుల్లో తనిఖీలేనా కేసుల నమోదు, ఉల్లంఘనులపై ఉక్కుపాదమేనా అది మాత్రమే కాదంటున్నాడో సీఐ. శాంతిభద్రతలే కాదు ప్రజారోగ్యమూ ఇంపార్టెంటే అంటున్నాడు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ తన పీఎస్ లిమిట్స్ లోకి ఎంట్రీ ఇవ్వకుండా కంచె వేస్తున్నాడు. ఇంతకీ ఎవరా సీఐ వైరస్ వ్యాప్తి చెందకుండా అతను తీసుకుంటున్న యాక్షన్ ప్లానేంటి.

ఊరూరా... వాడవాడలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఈయన పేరు గోపినాథ్. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి స్టేషన్ సీఐ. కరోనా సృష్టించే విలయాన్ని ముందే గ్రహించి అలర్టయిన గోపీనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి కరోనాను రానివ్వొద్దని ఏ ఒక్కరికి ప్రాణహాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నాడు. అనుకున్న తడవుగానే రంగంలోకి దిగారు.

40కి పైగా గ్రామాలు లక్షమందికి పైగా జనం 15 కిలోమీటర్ల వైశాల్యం ఇది శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి. ఇందులో చాలా గ్రామాల్లో కరోనాపై అవగాహన లేదు. దాంతో ఊరూరా తిరుగుతూ జనాల్లో అవగాహన కల్పించారు. ఫ్లెక్సీలు కట్టించి ప్రచారం చేశారు. గ్రామసర్పంచ్ లు, పెద్ద మనుషులతో సమావేశమై సామాన్య జనానికి వైరస్ గురించి ఎలా చెప్పాలో వివరించారు. ఊళ్లో ఉండే వాళ్లు చెబితేనే జనం కనెక్ట్ అవుతారని ప్రయత్నం చేసిన గోపీనాథ్ తొలి అడుగులోనే సక్సెస్ అయ్యారు.

ఊళ్లో జనంపైనే కాదు వలసకూలీలు, భవన నిర్మాణ కార్మికులపైనా ప్రత్యేక దృష్టి సారించాడు గోపినాథ్. వలస కూలీలకు స్థానిక ఫంక్షన్ హాళ్లలో బస ఏర్పాటు చేయించారు. నిత్యావసరాలు, ప్రభుత్వం ఇచ్చే రేషన్, నగదు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో పాటు మెడికల్ టీమ్స్ తో రోజూ హెల్త్ చెకప్ చేయించారు గోపీనాథ్. ఇక భవన నిర్మాణ రంగ కార్మికులకు బిల్డింగ్ ఓనర్లతో మాట్లాడి అందులోనే వసతి ఏర్పాట్లు చేయించారు గోపీనాథ్. ఎలాంటి ఇబ్బందులున్నా తనకు సమాచారం ఇవ్వాలని తన ఫోన్ నెంబర్ ఇచ్చిన గోపీనాథ్ తిండికి లోటు లేకుండా చేశాడు. బతుకు దెరువు కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన తమకు పోలీసులు ఎంతో సాయం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు కూలీలు.

పక్కనే ఉండే వికారాబాద్ లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని తెలియగానే వాహనాల రాకపోకలు నిషేధించారు గోపీనాథ్. లక్షణాలు ఉంటే హాస్పిటల్ వెళ్లాలని గ్రామాల ప్రజలకు సూచించారు. తమ పరిధిలో వైరస్ ఎంట్రీ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

లాక్ డౌన్ తో వైన్ షాప్స్ తో పాటు బెల్ట్ షాపులు కూడా మూసేలా చర్యలు తీసుకున్నారు సీఐ గోపినాథ్. బెల్ట్ పాయింట్లను గుర్తించి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. మద్యం అమ్మిన కొందరిపై కేసులు నమోదు చేశారు. కల్లు అమ్మకాలను కూడా మూసేయించారు సీఐ. మద్యం తాగే వారికి కరోనా అటాక్ అయ్యే అవకాశం ఎక్కువ అని అవగాహన కల్పించారు.

ముందు జాగ్రత్తలే కరోనాకి మందు అనే విషయాన్ని జనాల్లోకి వెళ్లేలా పకడ్బందీగా వ్యవహరించారు సీఐ. ప్రజాప్రతినిధులను, ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలిగిన సీఐ ప్రజారోగ్యానికి పెద్దపీట వేయటం తమ సామాజిక బాధ్యత అని తెలిపారు. అందరివాడులా, కుటుంబసభ్యుడిలా, ఊళ్లో ఒకరిలా జనంలో కలిసిపోతూ పోలీస్ అనే పదానికి కొత్తభాష్యం చెబుతున్న ఈ సీఐ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టాలు, విపత్తులు లను ఎలా ఎదుర్కోవాలో చేతల్లో చూపిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories