బ్రేకింగ్ : హుజూర్ నగర్‌లో భారీ మెజార్టీతో సైదిరెడ్డి విజయం

బ్రేకింగ్ : హుజూర్ నగర్‌లో భారీ మెజార్టీతో సైదిరెడ్డి విజయం
x
Highlights

కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్‌ను కారు పార్టీ బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కౌంటింగ్...

కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్‌ను కారు పార్టీ బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ మెజార్టీ కొనసాగింది. 40 వేల పైచిలుకు మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిరెడ్డిపై శానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. కారు జోరుకు హస్తం పార్టీ సిట్టింగ్ సీటును చేజార్చుకోకతప్పలేదు. ఇక బీజేపీ, టీడీపీలు కనీసం పోటీలో కూడా నిలవలేకపోయాయి. బీజేపీ గతంలో సాధించిన ఓట్లు కూడా సాధించ లేక చతికిల పడింది. కాంగ్రెస్ తరువాత మూడో స్ధానంలో ఇండిపెండెంట్ అభ్యర్ధి సుమన్ నిలవగా బీజేపీ నాలుగో స్ధానంలో, టీడీపీ ఐదో స్ధానంలో నిలిచాయి. పోలైన ఓట్లలో 56 శాతం ఒక్క టీఆర్ఎస్‌కే వచ్చాయి.

హుజూర్ నగర్‌ ఓటర్లు సీఎం కేసీఆర్ పాలనను మరోసారి ఆశీర్వదించారని శానంపూడి సైదిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపించాయని ఆయన అన్నారు. రైతులు, మహిళలు, కార్మికులు, యువత తమ ప్రభుత్వానికి అండగా నిలిచారని సైదిరెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories