శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సిద్ధం...కాంటాక్ట్‌ లెస్‌ సేవలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సిద్ధం...కాంటాక్ట్‌ లెస్‌ సేవలు
x
Highlights

కరోనా లాక్ డౌన్ కారణంగా మూసివేసిన శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మళ్లీ తన సేవలను కొనసాగించడానికి సిద్ధమైంది.

కరోనా లాక్ డౌన్ కారణంగా మూసివేసిన శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మళ్లీ తన సేవలను కొనసాగించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశీయ సర్వీసులను ప్రారంభిస్తున్నందున విమానాశ్రయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నట్లు జీఎంఆర్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ విమానాశ్రయ సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ నుండి దేశంలోని 36 ప్రాంతాలకు సర్వీసులు నడిపిస్తామన్నారు. మొదటి విడుతలో 30 శాతం, రెండో విడుతలో మరో 30 శాతం ఆపరేషన్స్‌ ప్రారంభిస్తామని తెలిపారు. ఆ తరువాత కొద్ది రోజులకు పూర్తి కార్యకలపాలను నిర్వహిస్తామని తెలిపారు.

ముందుజాగ్రత్తలో భాగంగా విమానాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి థర్మల్‌ స్కానింగ్‌ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా బోడింగ్ పాస్ తీసుకునే సమయంలో భౌతిక దూరం పాటించే గుర్తులు, ఆటోమేటిక్‌ హ్యాండ్‌ శానిటైజర్లు, దూరంగా కూర్చునేట్లు ఏర్పాట్లు చేసామన్నారు. వాటితో పాటుగానే ఎంట్రీ గేట్ల వద్దకూడా ఒకరికి మరొకరు తాకకుండా ఏర్పాట్లు చేసామన్నారు. అదే విధంగా చెకిన్‌ ఐలాండ్స్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రత్యేక యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేస్తే విమానాశ్రయంలో ఆహారం సిద్ధంగా ఉంచుతామన్నారు. విమానంలో ప్రయాణించే సమయంలో ఇదివరకు లాగా ఆహారం భుజించడాన్ని అనుమతించడం లేదన్నారు. ఇక ఇప్పటికే విదేశాల్లో చిక్కుకుపోయిన మూడు వేల మంది భారతీయులను వందే భారత్‌ విమానాల ద్వారా తీసుకువచ్చినట్లు తెలిపారు. అయినే ఏ ఒక్క విమానాశ్రయ సిబ్బందికి కరోనా సోకలేదని ఆయన ప్రకటించారు. కరోనా వైరస్ కారనంగా మార్చి 24 నుండి డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ , కమర్షియల్‌ ఆపరేషన్స్‌ను నిలిపివేశామని, రెండు నెలల అనంతరం మళ్లీ దేశీయ ప్రయాణాలకు పౌర విమానయాన శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తామని స్పస్టం చేసారు.

ఎయిర్‌పోర్ట్‌లో జాగ్రత్తలు..

10 ఏండ్లలోపు పిల్లలు, గర్భిణులు, 60 ఏండ్ల వారికి ప్రత్యేక అనుమతులు ఉంటేనే లోనికి

♦ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సిద్ధం...కాంటాక్ట్‌ లెస్‌ సేవలు కియోస్క్‌ క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌చేసి మొబైల్‌ ఫోన్‌ ద్వారా సెల్ఫ్‌ చెకిన్‌కు అవకాశం

♦ అందుబాటులో సెల్ఫ్‌ చెకిన్‌, సెల్ఫ్‌ బ్యాగ్‌ ట్యాగ్‌, స్కాన్‌ అండ్‌ ఫ్లై వంటి సేవలు

♦ బ్యాగేజీ, ట్రాలీ సిస్టమ్‌ల తనిఖీలకు డిస్‌ఇన్‌స్పెక్షన్‌ వ్యవస్థ

♦ క్యాబ్‌లో వచ్చే వారికి ప్రత్యేకంగా శానిటైజేషన్‌

♦ ప్రతి ప్రయాణికుడికి మాస్క్‌, శానిటైజర్‌, గ్లౌజులతో కూడిన కిట్‌

♦ ఒక హ్యాండ్‌ బ్యాగేజీ, ఒక చెకిన్‌ బ్యాగేజీకి మాత్రమే అనుమతి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories