ఏడేళ్ల చిన్నారి.. వీపంతా వాతలు.. ఏం జరిగింది..?

ఏడేళ్ల చిన్నారి.. వీపంతా వాతలు.. ఏం జరిగింది..?
x
Highlights

కొంత మంది పిల్లలు లేని దంపతులు తల్లిదండ్రులు లేని పిల్లలను దత్తత తీసుకుని ఎంతో అపురూపంగా వారిని పెంచుకుంటారు. అంతే కాదు వారికి ఉన్నత చదువులు చదివించి మంచి భవిష్యత్తును వారికి అందిస్తారు.

కొంత మంది పిల్లలు లేని దంపతులు తల్లిదండ్రులు లేని పిల్లలను దత్తత తీసుకుని ఎంతో అపురూపంగా వారిని పెంచుకుంటారు. అంతే కాదు వారికి ఉన్నత చదువులు చదివించి మంచి భవిష్యత్తును వారికి అందిస్తారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలో ఓ జంట పిల్లలు లేరని ఏడేళ్ల బాలికను దత్తత తీసుకున్నారు. ఆ బాలిక కూడా తనకు తల్లిదండ్రులు దొరికారని సంబరపడేలోపే ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి. పెంపుడు తల్లిదండ్రులు తమ ఏడేళ్ల బాలికను ఇష్టమొచ్చినట్లుగా చిత్ర వధ చేశారు. తీవ్రంగా హింసకు గురి చేస్తున్నారన్నారు. ఆ చిన్నారికి ఒల్లంతా వాతలు పెట్టి నరకం చూపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకెలితే హైదరాబాద్ నగరంలో కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆశాసింగ్, మణిపాల్ కౌర్‌ అనే దంపతులు ఓ ఏడేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్నారి స్ధానికులు తెలిపారు. ఈ చిన్నారికి తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారిని ఏం చేసినా అడిగే వారు ఉండరని వారు ఆ చిన్నారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కొట్టిన చోటు కొట్టకుండా, వీపు మీద వాతలు పెట్టి చిన్నారిని బాధపెడుతున్నారు. దీంతో ఆ చిన్నారి పరిస్థితి పూర్తిగా దారుణంగా మారింది. ఏడేళ్ల బాలిక ఒంటిపై ఎక్కడా ఖాళీ లేకుండా వాతలు పెట్టారు.

ఈ విషయంపై చుట్టుపక్కల వారు గమనించి బాలల హక్కుల సంఘానికి సమాచారం చేర వేసారు. దీంతో వారు స్పందించి చిన్నారిని రక్షించారు. ఆ సంఘం సభ్యులు చైల్డ్ లేబర్ అధికారులకు ఈ విషయాన్ని చేరవేసి, పోలీసుల సహకారంతో చిన్నారికి విముక్తి కలిగించారు. బాలిక అసలు తల్లిదండ్రులు ఎవరనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెంపుడు తల్లిదండ్రులు ఆశాసింగ్, మణిపాల్ కౌర్‌లను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories