Top
logo

మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి..

మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి..
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే బ్రాహ్మణపల్లి బాలయ్య(89) మృతిచెందారు. గతకొంత...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే బ్రాహ్మణపల్లి బాలయ్య(89) మృతిచెందారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బాలయ్య కామారెడ్డి మండలం బ్రాహ్మణపల్లిలో 1930లో జన్మించిన ఆయన స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. 1978లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలయ్య ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ బస్సులోనే ప్రయ్నసించేవారు. కాగా, మాజీ ఎమ్మెల్యే బి.బాలయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు.

Next Story