గ్రీన్‌ ఛాలెంజ్‌: మొక్కలు నాటిన సీనియర్‌ ఐఏఎస్‌ హర్పిత్సింగ్‌

గ్రీన్‌ ఛాలెంజ్‌: మొక్కలు నాటిన సీనియర్‌ ఐఏఎస్‌ హర్పిత్సింగ్‌
x
Highlights

పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలంటుంది ప్రభుత్వం. ఇదే నేపధ‌్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది.

పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలంటుంది ప్రభుత్వం. ఇదే నేపధ‌్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఇదే కోణంలో జోగినిపల్లి సంతోష్‌కుమార్ చెట్లను మరింత పెంచాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి హర్పిత్సింగ్‌ గురువారం మొక్కలు నాటారు. హైదరాబాద్ నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో బతుకమ్మ కుంట దగ్గర ఆయన మూడు మొక్కలు నాటారు. ఆ తరువాత ఆయన మరో ముగ్గురిని గ్రీన్‌ ఛాలెంజ్‌కు నామినేట్‌ చేశారు.

ఈ సందర్భంగా ఐఏఎస్‌ హర్పిత్సింగ్‌ మాట్లాడుతూ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం ద్వారా మొక్కలను ఎంతో మంది ప్రముఖులు నాటుతున్నారి, దాంతో పాటు మరోముగ్గురిని ఈ చాలెంజ్ విసుతున్నారని అన్నారు. పర్యావరణాన్ని కాపాడటానికి మొక్కల్ని నాటడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు. చెట్లు నీడను, మంచి ఆక్సిజన్‌ ఇవ్వడంతో పాటు ఇతర జీవరాశికి బ్రతుకునిస్తాయన్నారు చెట్ల ద్వారా మన చుట్టూ ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందన్నారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ కు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న 172 మంది ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఎంఈసీ వాళ్లకు గ్రీన్‌ ఛాలెంజ్‌ ప్రాధాన్యతను వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్‌ఆర్డీ అడిషనల్‌ డైరక్టర్‌ జనరల్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌, ఐటీ డైరక్టర్‌ శ్రీదేవీ అయలూరి, సీనియర్‌ ఫ్యాకల్టీ అబ్బాస్‌ అలీ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories