విధుల్లో చేరుతామంటూ డిపోలకొచ్చిన ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వం చెప్పే వరకు..

విధుల్లో చేరుతామంటూ డిపోలకొచ్చిన ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వం చెప్పే వరకు..
x
ఆర్టీసీ కార్మికులు
Highlights

సమ్మె విరమించి విధులకు హాజరుకావాలనుకుంటున్న కార్మికులకు చుక్కెదురవుతోంది. డిపోల వద్ద అధికారులు వారిని అడ్డుకుంటున్నారు. ఉన్నతాధికారుల నుండి తమకు...

సమ్మె విరమించి విధులకు హాజరుకావాలనుకుంటున్న కార్మికులకు చుక్కెదురవుతోంది. డిపోల వద్ద అధికారులు వారిని అడ్డుకుంటున్నారు. ఉన్నతాధికారుల నుండి తమకు ఆదేశాలు రాలేదని వారిని లోపలికి అనుమతించకుండా గేట్‌ వద్దే నిలువరిస్తున్నారు అధికారులు. ప్రభుత్వం తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో విధుల్లోకి చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. డిపోలోకి రాకుండా వారిని గేట్‌ వద్దే ఆపేశారు. ఉన్నతాధికారుల నుండి తమకు ఎలాంటి ఆదేశాలు రానందున లోపలికి అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పారు. దీంతో డిపో వద్దకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించారు.

బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. సమ్మె విరమణ ప్రతిపాదనపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. సర్కారు స్పందనపై కార్మికులు ఉత్కంఠగా ఎదురుచూశారు. కానీ, సమీక్ష అనంతరం సీఎంవో విడుదల చేసిన ప్రకటనలో ఈ ప్రస్తావనే లేదు. అయితే ఇవాళ మరోసారి సమీక్షించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories