సికింద్రాబాద్ - లాలాపేట్ ఫ్లైఓవర్ మరమ్మతులు డిసెంబర్ నాటికి పూర్తి : జీహెచ్ఎంసీ

సికింద్రాబాద్ - లాలాపేట్ ఫ్లైఓవర్ మరమ్మతులు డిసెంబర్ నాటికి పూర్తి : జీహెచ్ఎంసీ
x
Highlights

ఆరు నెలలుగా కొనసాగుతున్న సికింద్రాబాద్ - లాలాపేట్ ఫ్లైఓవర్ మరమ్మతు పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించారు. ఈ ఫ్లైఓవర్...

ఆరు నెలలుగా కొనసాగుతున్న సికింద్రాబాద్ - లాలాపేట్ ఫ్లైఓవర్ మరమ్మతు పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రకటించారు. ఈ ఫ్లైఓవర్ 1990 లో నిర్మించబడిందని ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ ఉండడం వలన ఈ ఫ్లైఓవర్ తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. దీంతో జీహెచ్‌ఎంసీ మరమ్మతు పనులను ప్రారంభించిందని వారు స్పష్టం చేశారు. అంతకుముందు నగర మేయర్, జీహెచ్ఎంసీ అధికారులు ఆగస్టు నాటికి ఈ వంతెన పనులు పూర్తయి ప్రారంభిస్తామని తెలిపినప్పటికీ పనులు పూర్తి అసంపూర్తి కావడంతో ప్రారంభానికి ఆలస్యం అయిందని వారు తెలిపారు.

ఈ మరమ్మతు పనులు ఆలస్యం కావడంతో, ఈసీఐఎల్, మౌలా-అలీ, ఎ.ఎస్.రావు నాగర్, సైనిక్‌పురి ప్రాంతాల ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అంతే కాక తార్నాక చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని ప్రయాణికులు తెలుపున్నారు. దీంతో కొంతమంది పౌరులు ఈ సమస్యను మైక్రోబ్లాగింగ్ సైట్ ద్వారా జీహెచ్‌ఎంసీ అధికారుల వద్దకు తీసుకువెళ్లారని దీంతో వెంటే జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు స్పందించి డిసెంబర్ చివరి నాటికి ఫ్లైఓవర్ మరమ్మతు పనులు పూర్తవుతాయని వారు తెలిపారన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories