రెండో విడత పంచాయితీ ఎన్నికల తుది ఫలితాలు ఇవే..

రెండో విడత పంచాయితీ ఎన్నికల తుది ఫలితాలు ఇవే..
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 88.26శాతం పోలింగ్ నమోదైంది. యాదాద్రిలో అత్యధికంగా 83.71 పోలింగ్,...

తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 88.26శాతం పోలింగ్ నమోదైంది. యాదాద్రిలో అత్యధికంగా 83.71 పోలింగ్, అత్యల్పంగా జగిత్యాలలో 80.23 శాతం పోలింగ్ నమోదైంది. 10 జిల్లాల్లో 90 శాతానికిపైగా పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.

ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కారు రయ్యిమంటూ దూసుకెళ్లింది. చాలా చోట్ల టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.. రెండో విడతలో టీఆర్ఎస్ బలపరిచిన 2610 మంది సర్పంచ్ అభ్యర్ధులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన వారిలో 835మంది గెలిచారు. టీడీపీ 39, బీజేపీ 37, సీపీఎం 21, సీపీఐ 12, ఇతరులు 561 మంది సర్పంచ్ అభ్యర్ధులు విజయం సాధించారు. మొదటి విడత తరహాలోనే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ కండువ పల్లెల్లో రెపరెపలాడింది. పంచాయితీ పోరులో బీజేపీ, టీడీపీలు ప్రభావం నామమాత్రంగానే మిగిలింది.

రెండో విడతలో మొత్తం 4,137 పంచాయతీ ఎన్నికల కోసం నోటిఫికేషన్లు వెలువడగా, వాటిలో 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3342 సర్పంచ్‌ పదవులు, వాటి పరిధిలోని 26,191 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ నిర్వహించారు.

ఇదిలావుంటే మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 2629, కాంగ్రెస్ 920, టీడీపీ 31, బీజేపీ 67, సీపీఐ 19, సీపీఎం 32, ఇతరులు 758 స్థానాల్లో సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories