ప్రధాన ప్రతిపక్షంలో మజ్లిస్ ...

ప్రధాన ప్రతిపక్షంలో మజ్లిస్ ...
x
Highlights

తెలంగాణా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అసెంబ్లీలో స్థానాల కేటాయింపు ఈ ఆసక్తి కారణమైంది. ప్రధాన ప్రతిపక్ష స్థానంలో మజ్లిస్ సభ్యులు కూచోవడం అందరిలోనూ ఆసక్తి కలిగించింది.

తెలంగాణా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అసెంబ్లీలో స్థానాల కేటాయింపు ఈ ఆసక్తి కారణమైంది. ప్రధాన ప్రతిపక్ష స్థానంలో మజ్లిస్ సభ్యులు కూర్చోవడం అందరిలోనూ ఆసక్తి కలిగించింది.

ఈరోజు తెలంగాణా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీలో సభ్యుల స్థానాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకు ముందు అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ టీఆర్ఎస్ లో విలీనం అయిపొయింది. దీంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా పోయింది. కాంగ్రెస్ తరపున ప్రస్తుతం 5 గురు సభ్యులు మాత్రమె ఉన్నారు. ఇక ఇదే సమయంలో మజ్లిస్ పార్టీ ఏడుగురు సభ్యులతో రెండో అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపధ్యంలో మజ్లిస్ పార్టీకి ప్రాధాన్ ప్రతిపక్ష సభ్యులు కూచునే వరుసలో స్థానాలు కేటాయించారు.

కాగా, తాజాగా మంత్రివర్గ విస్తరణ కూడా జరగడంతో గత అసెంబ్లీతో పోలిస్తే ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో వారి స్థానాల్లోనూ కూడా మార్పులు కనిపించాయి. ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ కు మజ్లిస్ మిత్ర పక్షంలా వ్యవహరిస్తుంది. అయితే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కూచునే స్థానాల్లో ఆ పార్టీ సభ్యులు కూర్చోవడం కొంత ఆసక్తిని కలిగించింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories