రైల్వేస్టేషన్లలో ఎయిర్ పోర్టు తరహా తనిఖీలు

రైల్వేస్టేషన్లలో ఎయిర్ పోర్టు తరహా తనిఖీలు
x
Screening Tests
Highlights

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో రవాణ వ్యవస్థ పూర్తిగా స్ధంబించిపోయింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో రవాణ వ్యవస్థ పూర్తిగా స్ధంబించిపోయింది. రైళ్లు, బస్సులు, విమానాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. లాక్ డౌన్ తరువాత మళ్లీ ఈ రవాణా వ్యవస్థను ప్రభుత్వాలు పునరుద్దరించనున్నాయి. ఇందులో భాగంగానే రైల్వేశాఖ రైల్వే స్టేషన్లలో అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. విమానాశ్రయాలలో ప్రయాణికులను పరీక్షించడానికి, తనిఖీలు చేయడానికి ఏవిధమైన ఏర్పాట్లు చేసారో అలాంటి ఏర్పాట్లు చేయడంలో రైల్వేశాఖ నిమగ్నమైంది. రైలు ప్రయాణాలు గతంలోలాగా ఉండవని ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలు అమలు చేస్తున్నామని రైల్వే శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్లకు రైలు సమయం కంటే 2,3 గంటలు ముందుగానే చేరుకోవాలని సూచనలు జారీ చేస్తున్నారు.

అంతే కాక ప్రయాణికులు ఇంతకుముందులాగా అన్ని ప్రవేశ ద్వారాలనుంచి కాకుండా ఒకటే ద్వారం లోపలికి వచ్చే ఏర్పాట్లు చేసామన్నారు. అలాగే బయటికి వెళ్లే మార్గాన్ని కూడా ఏర్పాట్లు చేసామన్నారు. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఆరోగ్య పరీక్షలు, వారి సామాగ్రిని ముందుగా పరీక్షించిన తరువాతనే ప్రయాణానికి అనుమతిస్తామని తెలిపారు. జలుబు, దగ్గు, లాంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వారిని ప్రయాణానికి అనుమతించమని స్పష్టం చేస్తున్నారు. ప్రయాణికులను ఏ విధంగా తనిఖీలు చేస్తారో ఆ అంశంపై దక్షిణ మధ్యరైల్వే పరిధిలోని గుంటూరులో, వెస్ట్ జోన్ పరిధిలోని జబల్ పూర్ రైల్వే స్టేషన్లలో ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని, రైళ్లలో సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories