Breaking news: తెలంగాణలో మార్చి 31 వరకూ స్కూళ్లు, కాలేజీలు, మాల్స్ బంద్

Breaking news: తెలంగాణలో మార్చి 31 వరకూ స్కూళ్లు, కాలేజీలు, మాల్స్ బంద్
x
high-level meeting
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైలెవల్ కమిటీ మీటింగ్ కొనసాగుతోంది. కరోనా (కొవిడ్‌-19) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు...

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైలెవల్ కమిటీ మీటింగ్ కొనసాగుతోంది. కరోనా (కొవిడ్‌-19) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 31 వరకూ విద్యా సంస్థలు, థియేటర్లు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా జాగ్రత్తపై సమావేశమావేశంలో చర్చిస్తున్నారు. సాయంత్రం జరిగే కేబినెట్ భేటీలో రిపోర్టు సమర్పించనున్నారు. మరో నాలుగు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్‌ ప్రకారం జరుగనున్నాయి.

అలాగే, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను సైతం కుదించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేపు, ఎల్లుండి నిర్వహించి సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories