logo

హైదరాబాద్ లో స్కూల్ బస్సుల తనిఖీలు

హైదరాబాద్ లో స్కూల్ బస్సుల తనిఖీలు
Highlights

హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు....

హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. హబ్సిగూడ దగ్గర ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూలు, కాలేజీ బస్సులను సీజ్ చేశారు. ఈ నెల 12 నుంచి 30 వరకు ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీ లో 71 కేసులు నమోదయ్యాయి. ఫిట్నెస్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ కిట్ లేకుండా నడుపుతున్న స్కూలు, కాలేజీ బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను ఉపేక్షించబోమని అధికారులు చెబుతున్నారు.


లైవ్ టీవి


Share it
Top