తల్లికైనా ప్రవేశం లేదు.. గ్రామస్థుల నిర్ణయానికి కట్టుబడిన సర్పంచ్‌

తల్లికైనా ప్రవేశం లేదు.. గ్రామస్థుల నిర్ణయానికి కట్టుబడిన సర్పంచ్‌
x
Representational Image
Highlights

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వైరస్ విలయతాండవం చేస్తుంది....

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వైరస్ విలయతాండవం చేస్తుంది. దీన్ని కట్టడి చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేసాయి. ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, ఒక ఊరినుంచి మరో ఊరికి ప్రయాణాలు చేయకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలను కొంత మంది ప్రజాప్రతినిధులు, నాయకులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గ్రామ సర్పంచ్ పంచాయతీ నిర్ణయానికి కట్టుబడి తనకు జన్మనిచ్చిన తల్లి గ్రామ ప్రవేశానికి నిరాకరించాడు. బంధువుల ఇంటి నుంచి వచ్చిన తల్లిని తిప్పి పంపించేశాడు.

పూర్తివివరాల్లెళితే సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ మండలం గోసాయిపల్లి గ్రామ సర్పంచ్ తల్లి తులశమ్మ ఇటీవలే సిర్గాపూర్‌లోని బంధువుల వద్దకు వెళ్లింది. కాగా సిర్గాపూర్ మండల కేంద్రంలో కరోనా లక్షణాలు ఉన్న మూడు కుటుంబాలను క్వారంటేయిన్‌లో ఉంచారు. దీంతో అప్రమత్తమైన గోసాయిపల్లి గ్రామస్థులు తమ గ్రామానిక ఇతర గ్రామాల నుంచి ఎవరూ రాకుండా గ్రామశివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసుకున్నారు. బయటి నుంచి ఎవరైనా వచ్చినా వారికి గ్రామంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సిర్గాపూర్‌లో బంధువుల ఇంటికి వెళ్లిన సర్పంచ్‌ సాయాగౌడ్‌ తల్లి సోమవారం గోసాయిపల్లికి చెక్ పోస్ట్ దగ్గరికి చేరుకుంది. దీంతో ఆమెను వీఆర్‌ఏలు అక్కడే నిలిపి వేసి గ్రామ సర్పంచ్‌కు సమాచారమిచ్చారు. కానీ ఆ సర్పంచ్ రక్త సంబంధాన్ని కూడా లెక్క చేయకుండా తన గ్రామ ప్రజల మంచి కోరి ఇతర గ్రామాల నుంచి ఎవరినీ రానీయొద్దనే గ్రామస్థుల నిర్ణయాన్ని గౌరవించారు. సర్పంచ్‌ తన తల్లిని ఊర్లోకి రానివ్వకుండా పొలిమేరల్లో అడ్డుకుని వెనుకకు పంపించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories