Telangana: జంటనగరాల్లో సంక్రాంతి రష్

Telangana: జంటనగరాల్లో సంక్రాంతి  రష్
x
Highlights

సంక్రాంతి పండుగ దగ్గరపడటంతో పట్టణాలు.. పల్లెబాట పడుతున్నాయి.

సంక్రాంతి పండుగ దగ్గరపడటంతో పట్టణాలు.. పల్లెబాట పడుతున్నాయి. జంట నగరాల్లోని తెలుగు రాష్ట్రాల ప్రజలు.. తమ సొంత ఊళ్లలో పండుగ జరుపుకునేదుకు బయలుదేరారు. వేలాది మంది నగరవాసులు ఒక్కసారిగా ఊళ్లకు బయలుదేరడంతో.. హైదరాబాద్ లోని ప్రధాన బస్టాండులన్నీ రద్దీగా మారాయి. ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.

స్కూళ్లకు సెలవులు రావడంతో నగరవాసులు ఉదయం నుంచే.. ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ తో పాటు జంట నగరాల్లోని ప్రధాన బస్టాండ్లకు చేరుకుంటున్నారు. దీంతో ప్రధాన సెంటర్లలో కూడా సంక్రాంతి రష్ పెరిగింది. ఇప్పటికే బస్సుల్లో సీట్లు లేక, వెయిటింగ్ లిస్ట్ రావడంతో.. అందరూ బస్టాండ్స్ కు చేరుకుని, స్పెషల్ బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. స్పెషల్ బస్సుల్లో అధిక ధరలు వసూలు చేయడంతో పాటు.. బస్సుల కోసం గంటలకొద్ది ఎదురు చూడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్కూళ్లకు సెలవులు రావడంతో పాటు సంక్రాంతి పండుగ దగ్గరపడటంతో కుటుంబ సమేతంగా నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. నగరవాసులు తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కొర్లపహాడ్‌, పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు పోటెత్తాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

రోజూ రోడ్ల మీద తిరిగే బస్సే. చవకైన, సౌకర్యవంతమైన ప్రయాణంతో గమ్యస్థానాలకు చేర్చే నేస్తమే! ప్రయాణికుడు మాత్రం దాన్ని చూస్తేనే వామ్మో అని జడుసుకుంటున్నాడు. బస్సు ప్రయాణమంటేనే హడలిపోతున్నాడు. పండుగకు కాస్త ముందుగానే ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుదామనుకుంటే 'చార్జీల'తో బస్సు బుసలు కొడుతోందని బెంబేలెత్తిపోతున్నాడు. సంక్రాంతి పండగ సీజన్‌, ఒక్కసారిగా బస్‌ టికెట్‌ను కాస్ట్‌లీగా మార్చేసింది. పండుగ సందర్భంగా రద్దీ పెరగడంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు చార్జీలను రెండు, మూడు రెట్లు పెంచేశారు. ఆర్టీసీ కూడా ప్రయాణికులకు 'పండగ ఎఫెక్ట్‌'ను చూపిస్తోంది. పండుగకు ప్రత్యేక బస్సులు వేసినా అదనంగా 50శాతం చార్జీలను వసూలు చేస్తోంది. అయినా కొనేందుకు ఎగబడుతున్న ప్రయాణికులకు బస్‌ టికెట్‌ దొరకడం గగనం అవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories