దీనిద్వారా కరెన్సీ నోట్లు..స్మార్ట్ ఫోన్లను శానిటైజ్ చేయొచ్చు...

దీనిద్వారా కరెన్సీ నోట్లు..స్మార్ట్ ఫోన్లను శానిటైజ్ చేయొచ్చు...
x
Highlights

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటికి వెళ్లినపుడు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులకు శానిటైజర్లు రాసుకోవడం, అలాగే ప్రతి నిత్యం చేతులను శుభ్రంగా కడుక్కుంటున్నారు. అలాగే బయటి నుంచి తీసుకువచ్చే సామాగ్రిని కూడా వెంటనే శానిటైజేషన్ చేసి ఇండ్లలోకి తీసుకువెలుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఎంతో మంది చేతులలో నడిచే కరెన్సీ, అలాగే నిత్యం వాడే స్మార్ట్ ఫోన్లను మాత్రం శానిటైజేషన్ చేయలేం.

దీన్ని దృష్టిలో పెట్టుకున్న డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్డీవో) ఓ చక్కని పరిష్కారం మార్గం చూపింది. డీఆర్డీవో హైదరాబాద్‌ ల్యా బ్‌ డిఫెన్స్‌ రీసెర్చ్‌ ఆల్ట్రావయోలెట్‌ శానిటైజర్‌ (డీఆర్‌యూవీఎస్‌)- క్యాబినెట్‌ను నిత్యం వాడే ఫోన్లు, ఐపాడ్స్‌, ల్యాప్‌టాప్స్‌, కరెన్సీ నోట్లు, కాగితాలు, చెక్కులు, చలాన్లు, పాస్‌బుక్‌లు, పుస్తకాలు ఇలాంటి వాటిని శానిటైజ్‌ చేసేందుకు కనుగొన్నట్టు రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది.

ఈ క్యాబినెట్ ద్వారా ప్రసరించే 360 డిగ్రీల్లో యూవీ కిరణాల ద్వారా అందులో ఏదైనా వస్తువులను పెడితే అవి శానిటైజ్‌ (క్రిమి/వైరస్‌ రహి తం) అవుతాయని తెలిపింది. అయితే ఈ పరికరాన్ని వినియోగించే సమయంలో ఎవరూ కూడా దీనికి దగ్గరలో ఉండకూడదని, అలాగే దాన్ని తాకకూడదని తెలిపారు. ఆటోమెటిక్‌ మెకానిజం, సెన్సార్‌తో పనిచేసే స్విచ్‌లతో ఉది పనిచేస్తుందని పేర్కొన్నది. ఒక్కో కరెన్సీ నోటును యూవీ కిరణాల సమక్షంలో సూక్ష్మజీవి రహితంచేసేలా నోట్స్‌క్లీన్‌ డివైజ్‌ను కూడా ఆర్సీఐ అభివృద్ధి చేసినట్టు వివరించింది. వస్తువులు సూక్ష్మజీవి రహితం కాగానే క్యాబినెట్‌ స్లీప్‌మోడ్‌కి వెళ్తుందని పేర్కొన్నది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories