మరో రెండు, మూడు నెలలు లాక్‌డౌన్ పొడిగించాలి: జగ్గారెడ్డి

మరో రెండు, మూడు నెలలు లాక్‌డౌన్ పొడిగించాలి: జగ్గారెడ్డి
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేసీఆర్ ముందు చూపుతో లాక్ డౌన్ పొడిగించారని, మరో...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేసీఆర్ ముందు చూపుతో లాక్ డౌన్ పొడిగించారని, మరో రెండు, మూడు నెలలు ఇలానే కొనసాగించాలని కోరారు. లాక్ డౌన్ వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు లాక్ డౌన్ సరైన నిర్ణయమని జగ్గారెడ్డి అన్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు సైతం తెగించి విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ,నర్సు లకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయలు కల్పించాలని కోరారు. అలాగే 24 గంటలు విధులు నిర్వహిస్తున్న పోలీస్ లకు సైతం అన్ని రకాల సదుపాయాలు కలిగించాని చెప్పారు. ఆర్ధికవేత్తలతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరుపాలని, ఆర్ధిక నిపుణులు కూడా ప్రభుత్వాలకు ఆర్థికంగా నిలదొక్కుకునే అంశాలపై సలహాలు సూచనలు ఇచ్చి సహకరించాలి జగ్గారెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories