ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
x
Highlights

మంత్రి పువ్వాడ అజయ్ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ...

మంత్రి పువ్వాడ అజయ్ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తో పులాట జరిగింది. బలవంతంగా అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు.

ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. టీజేఎస్ కార్యకర్త సంజీవ్ స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఆర్టీసీ కార్మికులు సంజీవ్‌ను ఆసుపత్రికి తరలించారు. ఒకరు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎక్కడివారినే అక్కడే అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశాడని ఆర్టీసీ డ్రైవర్ ఇస్మాయిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories