Top
logo

హరీశ్‌రావుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్‌..

హరీశ్‌రావుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్‌..
Highlights

ప్రాజెక్టులపై సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. 30 ఏళ్ల...

ప్రాజెక్టులపై సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. 30 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో టీఆర్ఎస్‌ పాలనలో ఎన్ని కట్టారో చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌పై పడి విమర్శలు చేయడం కాదని రాష్ట్రంలో తమ పార్టీ లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు మంత్రిగా ఉండి హరీశ్ రావు ఎన్ని ప్రాజెక్ట్‌లు కట్టారో తెలపాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద చర్చ పెడదామని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుకు దమ్ముంటే చర్చకు రావాలన్నారు. హరీశ్ రావులా తాను గోతులు తీసే రకం కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.


Next Story

లైవ్ టీవి


Share it