ఆన్ లైన్ లో బుక్ చేస్తే .. ఇసుక ఇంటికే

ఆన్ లైన్ లో బుక్ చేస్తే .. ఇసుక ఇంటికే
x
Highlights

టెక్నాలజీ పెరిగిన తరువాత ఏదైనా వస్తువు కానీ, తినే పదార్థాలు కానీ ఏది కావాలనుకున్నా ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు అది మన ఇంటికి వచ్చి చేరుకుంటుంది.

టెక్నాలజీ పెరిగిన తరువాత ఏదైనా వస్తువు కానీ, తినే పదార్థాలు కానీ ఏది కావాలనుకున్నా ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు అది మన ఇంటికి వచ్చి చేరుకుంటుంది. దీంతో చాలా మందికి బయటికి వెళ్లే పనికూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇదే తరహాలో ఇసుకను కూడా ఇక్కసారి ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే చాలు అది లోడ్ అయి మన ఇంటికి చేరుకుంటుంది. ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి నేటి కాలంలో ఇసుక దొరకక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ఇసుక అక్రమ రవాణాను కూడా దీని ద్వారా అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఇసుక ట్రాక్టర్ ఆర్డర్ బుక్ చేసుకున్నవారి ఇంటికి చేరుకునేంత వరకు ఆ ట్రాక్టర్ సంబంధించిన ప్రతి అప్డేడ్ ని గమనించవచ్చు.

ప్రస్తుతం ఈ సదుపాయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ప్రాంతాల్లో ప్రారంభించారు. మన ఇసుక వాహనంతో ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ద్వారా ఇసుక సరఫరాకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇక ఈ ట్రాక్టర్ కు మన ఇసుక వాహనం పేరిట జియో ట్యాగింగ్‌ ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో మన ఇసుక బండికి సంబంధించిన పూర్తి వివరాలగురించి అధికారులకు సమాచారం అందుతుంది. ఎవరైతే ఇసుకను బుక్‌ చేసుకుంటారో ఆ వినియోగదారుడి ఇంటికి వెళ్లి లోడ్‌ చేరుకున్నాక తనకు ఇసుక అందిందని ఆన్‌లైన్‌లో సమాచారమిస్తేనే ఆ ట్రాక్టర్‌కు కిరాయి వస్తుంది. ప్రస్తుతం ఈ 6 ప్రాంతాల నుంచి మాత్రమే ఈ ఇసుకను తరలిస్తున్నారు.

ఇక ఈ ట్రాక్టర్‌కు కిలోమీటరుకు ఇసుక తీసుకొచ్చినందుకు రూ.80 చొప్పున ప్రభుత్వం కిరాయి అందిస్తుంది. ఈ బుకింగ్ ను స్యాండ్‌ ర్యాంపు నుంచి కేవలం 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధి వరకు ఉండే వారు మాత్రమే సరఫరా చేసుకునే వీలును కల్పించింది. ఇప్పటివరకూ 18,091ట్రిప్పులు బుక్‌ కావడంతో మరికొన్ని పంచాయతీల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఈ పద్దతితో ప్రజలకు ఇసుక గురించిన టెన్షన్ తగ్గుతుంది. అంతే కాకుండా సరైన సమయంలో ఎంత ఇసుక కావాలనుకుంటామో అది ఇంటికి చేరుకుంటుంది. దీంతో ఇంటి నిర్మాణం చేసుకునేవారు నిశ్చింతగా నిర్మాణాలను పూర్తి చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories