హైకోర్టును ఆశ్రయించనున్న సమత దోషులు

హైకోర్టును ఆశ్రయించనున్న సమత దోషులు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో దిశ హత్యా ఉదంతం తరువాత అంత సంచలనమైన కేసు సమత కేసు.

తెలంగాణ రాష్ట్రంలో దిశ హత్యా ఉదంతం తరువాత అంత సంచలనమైన కేసు సమత కేసు. గతేడాది నవంబర్‌ 24న ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో ముగ్గురు దుండగులు సమతపై సామూహిక అత్యాచారం చేసారు. తరువాత ఆ యువతిని అతి కిరాతకంగా హత్య చేశారు. అప్పటి నుంచి ఆదిలాబాద్ కోర్టులో ఈ కేసు పై విచారణ జరిపించారు.

అదే నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు కూడా సంచలన తీర్పు నిచ్చింది. దోషులకు ఉరీ తీయాలని ఉత్తర్వులను జారీ చేసింది. దాంతో పాటుగానే ఆ ముగ్గురు దోషులు 26 వేల జరిమానాలను కూడా కట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాగా కోర్టు ఆదేశాల ప్రకారం 26 వేల రూపాయల జరిమానాను వారి కుటుంబ సభ్యలు శనివారం రోజున చెల్లించారు.

నిర్భయ కేసులో ఎలాగయితే నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నారో ఇప్పుడు సమత కేసు నిందితులు షేక్ బాబు, షాక్ షాబుద్దీన్, షేక్ మగ్దుమ్‌ లు కూడా రేపు హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి అప్పీల్ ను సుప్రీం కోర్టు ఏ విధంగా స్వీకరిస్తుందో చూడాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories